27 ఏళ్ల తర్వాత అక్కడ మరెవరికీ సాధ్యం కాని రేర్ రికార్డ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీదే..!

హాలీవుడ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ అవార్డుల పరంపరతో పాటు అంతర్జాతీయ స్థాయిలో హంగామా కంటిన్యూ అవుతూనే ఉంది.. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి మీద ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది.. ఆయనతో పాటు ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా పేరు, ప్రఖ్యాతలు దక్కుతున్నాయి.. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరికీ కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది..

అలాగే ఇప్పటికే పలు అవార్డులు, రివార్డులు దక్కాయి.. తాజాగా ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో.. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎమ్.ఎమ్.కీరవాణి ఎన్నికయ్యారు.. అలాగే ‘బోస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ లోనూ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విన్నర్‌గా కీరవాణి అవార్డు గెలుచుకున్నారు.. ఆస్కార్ బరిలో నిలవనుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ట్రిపులార్ చిత్రానికి ఇలా వరుసగా అరుదైన అవార్డులు, ఆశ్చర్యపరిచే గౌరవం దక్కుతుండడంతో ఫ్యాన్స్, మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

కట్ చేస్తే.. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సాలిడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఇక ముందు ఈ ఘనతను మరో చిత్రం సాధించడం కష్టమే అనేంతలా అరుదైన రికార్డ్ సెట్ చేసింది. ఇటీవల జపాన్‌లో రిలీజ్ చేయగా ఎంతటి స్పందన వచ్చిందో తెలిసిందే.. అక్కడి ప్రేక్షకులు మన తెలుగు సినిమా మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకు అంతా షాక్ అయ్యారు..

ఇకపోతే ‘ఆర్ఆర్ఆర్’ 27 ఏళ్ల తర్వాత అక్కడ సరికొత్త చరిత్ర సృష్టించింది.. ఇప్పటివరకు జపాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీ రికార్డ్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన‘ముత్తు’ సినిమా పేరు మీద ఉంది.. అక్కడ ‘ముత్తు’ కలెక్షన్స్.. రూ.23.50 కోట్లు.. సౌత్ సినిమాలకు జపాన్, మలేేషియా వంటి దేశాల్లో గుర్తింపు తీసుకొచ్చారు రజినీ కాంత్..

అయితే ‘బాహుబలి’ సిరీస్ కూడా ‘ముత్తు’ రికార్డ్‌ని టచ్ చేయలేకపోయింది.. ఇప్పుడు జక్కన్న చిత్రమే జపాన్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది.. ట్రిపులార్ 400 మిలియన్ యెన్‌లు సాధించింది.. మన కరెన్సీలో రూ.24.10 కోట్లు.. అక్కడ ‘ముత్తు’ అప్పటి టికెట్ రేట్లు, ఇప్పటి టికెట్ రేట్లు ఒకటే.. ‘ఆర్ఆర్ఆర్’ బాగానే ఆడుతున్నా రజినీ రికార్డ్‌ని బీట్ చేయడం కష్టమే అనుకున్నారు.. కానీ 27 సంవత్సరాల తర్వాత ఆ రికార్డుని తెలుగు సినిమా బీట్ చేయడం ఆశ్చర్యం.. ఇప్పట్లో మరే చిత్రం ఇలాంటి అరుదైన ఘనతను సాధించలేదనేే చెప్పాలి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus