Dasara: ‘దసరా’ నిర్మాతకి ఇదే మొదటి హిట్టు.. అవన్నీ ప్లాపులే పాపం!

మంచి అభిరుచి కలిగిన, ప్యాషన్ కలిగిన నిర్మాతగా సుధాకర్ చెరుకూరికి మంచి పేరుంది. కానీ ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా పడలేదు. 2016 లో సందీప్ కిషన్ కిషన్ హీరోగా వచ్చిన ‘రన్’ చిత్రంతో కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈయన.. అటు తర్వాత ‘పడి పడి లేచె మనసు’ ‘విరాటపర్వం’ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి చిత్రాలు చేశారు. ఇందులో ఒక్కటి కూడా సక్సెస్ సాధించలేదు.

దీంతో ప్లాప్ నిర్మాత అనే ముద్ర ఇతని పై పడింది. ఈ బ్యానర్లో నాని హీరోగా ‘దసరా’ (Dasara) రూపొందుతుంది అంటే ఇండస్ట్రీ వర్గాల్లో ఎటువంటి అంచనాలు లేవు. పైగా ఈ చిత్రానికి ప్రమోషన్స్ తో కలుపుకుని రూ.80 కోట్లు బడ్జెట్ పెట్టారు అంటే… ఇక కష్టమే అనే కామెంట్లు కూడా వినిపించాయి. కానీ నిన్న రిలీజ్ అయిన ‘దసరా’ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే మొదటి రోజు ఏకంగా రూ.20 కోట్ల పైనే షేర్ ను కలెక్ట్ చేసింది.

ఇప్పటి వరకు ఈ బ్యానర్లో రూపొందిన సినిమాలు ఫుల్ రన్ ముగిసినా ఇంత కలెక్ట్ చేసింది లేదు. కానీ ‘దసరా’ మాత్రం నిజంగానే ధూమ్ ధామ్ చేసింది అని చెప్పొచ్చు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. ‘దసరా’ ఇచ్చిన సక్సెస్ తో భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయడానికి వారికి హోప్ దొరికిందని చెప్పొచ్చు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus