తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిన పెంచిన సినిమా బాహుబలి. ఈ మూవీ తర్వాత స్థానంలో పవన్ కళ్యాణ్ తాజా చిత్రం నిలిచింది. ఏ కేటగిరీలో అనుకుంటున్నారా? బడ్జెట్ పరంగా బాహుబలి తర్వాతి స్థానాన్ని కైవశం చేసుకుంది. బాహుబలి 150 కోట్లతో నిర్మితమైంది. బాహుబలి 2 కి 200 కోట్లు పైనే ఖర్చు అయింది. ఆ తర్వాత టాలీవుడ్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా మహేష్ బాబు స్పైడర్ నిలిచింది. మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి వందకోట్ల మేర ఖర్చు అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా వందకోట్ల బడ్జెట్ దాటిపోయి 120 కోట్లకు చేరిందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 150 కోట్లు జరిగినట్లు సమాచారం. ఇంకా పేరుని అధికారికంగా పాటించని ఈ మూవీ ఫస్ట్ సింగిల్ “బైటి కొచ్చి చూస్తే..” సాంగ్ యువతని ఓ ఊపు ఊపింది.
తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ కంపోజ్ చేసిన పాటలు సినిమాకు ప్లస్ కానున్నాయని సినీ విశ్లేషకులు ఇప్పుడే తేల్చి చెప్పేసారు. త్వరలో యూరోప్ సోఫియా సిటీలో పవన్, కీర్తి లపై కొన్ని సన్నివేశాలు షూట్ చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. కుష్బూ, వెంకటేష్ కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.