‘ఎయిర్టెల్ 4G’ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో? ఏం చేస్తుందో తెలుసా?

ఎయిర్టెల్ యాడ్ లో నటించి గల్లీ నుండి ఢిల్లీ వరకు పాపులర్ అయిన సాషా ఛెత్రి అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘ఇంతకంటే వేగంగా నెట్‌వర్క్‌ వస్తే లైఫ్‌టైమ్‌ మొబైల్‌ బిల్లు ఫ్రీ…’ అంటూ టీవీల్లో మోత మోగించేది ఈ బ్యూటీ. ‘ఎయిర్‌టెల్ 4జీ అమ్మాయి’గా ఈమె బాగా ఫేమస్. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో జన్మించిన ఈ బ్యూటీ… అక్కడే గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన సాషా.. ఆ తర్వాత ముంబై వెళ్లి అడ్వర్టైజింగ్ స్టడీ అభ్యసించింది.

ఎయిర్టెల్ యాడ్ చేయడానికి ముందుకు సాషా ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్ ట్రైనీగా పనిచేసేది. ఈ యాడ్ కోసం మొదట ఆమెకు కాల్ వస్తే ఫేక్ ఏమో అని లైట్ తీసుకుంది. కానీ తర్వాత అది నిజమని తెలిసి ఆశ్చర్యపోయింది. ఈ యాడ్ సాషా లైఫ్ నే మార్చేసింది. అలాగే ఎయిర్ టెల్ కస్టమర్స్ సంఖ్య కూడా పెరిగింది. ఈ యాడ్ తర్వాత ఆమె బాలీవుడ్లో సినిమా చేసే ఛాన్స్ ను దక్కించుకుంది. ‘కత్తి బట్టి’ చిత్రం ద్వారా నటిగా మారింది.

అటు తర్వాత సౌత్లో కూడా పలు చిత్రాల్లో నటించింది. సాషా చివరిసారిగా ప్రభాస్ నటించిన (Radhe Shyam )’రాధేశ్యామ్’ చిత్రంలో నటించింది. ఈ మూవీలో ఆమె నిత్య అనే పాత్రలో నటించింది. ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఆమె పాత్రకి కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే గతేడాది సెప్టెంబర్ నుండి ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటం లేదు. ఎటువంటి పోస్టులు పెట్టడం లేదు. దీంతో ‘ఈమెకు ఏమైంది’ అనే డిస్కషన్ మొదలైంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus