Sikandar: సల్మాన్ దెబ్బకు బాలీవుడ్ లో మళ్లీ టెన్షన్ టెన్షన్!

బాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ప్రస్తుతం ఆశించిన స్థాయిలో లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది భారీ హైప్‌తో విడుదలైన సికందర్ (Sikandar) ఫెయిల్యూర్‌తో పరిశ్రమలో మళ్లీ నెగటివ్ వైబ్ మొదలైంది. సల్మాన్ ఖాన్ (Salman Khan), రష్మిక మందన్నా (Rashmika Mandanna), మురుగదాస్ (A.R. Murugadoss) కాంబినేషన్‌పై భారీ అంచనాలున్నా.. ఈ సినిమా ఆ అంచనాలకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయింది. దీంతో బాలీవుడ్‌ ఫ్యూచర్‌పై పలు అనుమానాలు, చర్చలు మొదలయ్యాయి. 2025లో ఇప్పటివరకు బాలీవుడ్‌లో కేవలం రెండు బ్లాక్‌బస్టర్లు మాత్రమే వచ్చాయి.

Sikandar

మిగతా సినిమాలన్నీ మిశ్రమ స్పందన పొందాయి. సికందర్ టోటల్ ఫెయిల్యూర్ కావడం ఇండస్ట్రీకి బ్8గ్ డేంజర్ అలెర్ట్ గా మారింది. ఇకపై రిలీజ్ అయ్యే జాట్ (Jaat) (సన్నీ డియోల్  (Sunny Deol), వార్ 2 (హృతిక్(Hrithik Roshan)  – ఎన్టీఆర్‌  (Jr NTR) ), హౌస్‌ఫుల్ 5, సితారే జమీన్ పర్ (ఆమిర్ ఖాన్ (Aamir Khan), ఆల్ఫా (ఆలియా భట్ (Alia Bhatt) లాంటి చిత్రాలపై భారీ భారం పడుతోంది. ఇవి ఆడకపోతే బాలీవుడ్ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ఒరామాక్స్ రిపోర్ట్ ప్రకారం, 2024లో బాలీవుడ్ ఆదాయం రూ. 4,679 కోట్లు. ఇది 2023లోని రూ. 5,380 కోట్ల ఆదాయంతో పోల్చుకుంటే స్పష్టమైన డ్రాప్.

కరోనాకి ముందు 2019లో ఆదాయం రూ. 4,831 కోట్లు. అంటే పరిశ్రమ ఇంకా కోలుకోవడంలో వెనుకబడి ఉందన్న మాట. ముఖ్యంగా గత ఏడాది వచ్చిన ఆదాయంలో మూడింట ఒక వంతు డబ్బింగ్ చిత్రాలదే కావడం ఆందోళనకరం. ఈ ఏడాది కూడా పుష్ప 2 (Pushpa 2), కల్కి 2898 AD (Kalki 2898 AD) లాంటి సౌత్ సినిమాలదే హిందీ బిజినెస్‌లో ఆధిక్యం. ఇప్పుడు బాలీవుడ్ అసలైన హిట్ సినిమాలు తక్కువగా ఉండటంతో.. చిన్న సినిమాలు బ్రతకలేకపోతున్నాయి.

భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే లాభాల్ని తెస్తున్నాయి. ఇక థియేటర్లు చాలా చోట్ల ఖాళీగా ఉంటున్నాయి. అనేక థియేటర్లు ఇప్పుడు సినిమా కాకుండా ఈవెంట్ హాల్‌లుగా మారిపోతున్నాయంటే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థమవుతుంది. మొత్తానికి సికందర్ ఫెయిల్యూర్ బాలీవుడ్‌కు మరో షాక్‌ ఇచ్చినట్లే. ఇక ముందు విడుదల కానున్న స్టార్ ప్రాజెక్ట్స్ మీదే పరిశ్రమ ఆశలన్నీ పెట్టుకుంది. ఒకవేళ ఇవి కూడా సత్తా చాటలేకపోతే.. బాలీవుడ్ మరోసారి డేంజర్ జోన్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

సీనియర్ క్రికెటర్ బయోపిక్ కోసం కామెడీ హీరో.. న్యాయం చేయగలడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus