Geethika: యాక్సిడెంట్ తర్వాత ఆట ఫేమ్ గీతిక పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

  • June 11, 2021 / 04:50 PM IST

‘ఆట’ చిన్నారి గీతిక అందరికీ గుర్తుండే ఉంటుంది.ఆ షోలో ‘సుందరం మాస్టార్‌.. ‘ అంటూ ఎంతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ప్రేక్షకులను అలరించిన ఈ పాప… చిన్న వయసులోనే డ్యాన్స్‌లతో దుమ్మురేపేసేది. ఆ టైంలో గీతిక పేరు మార్మోగిపోయింది. ఇక ‘ఆట’ టైటిల్ విన్నర్ అయిన తర్వాత ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. కానీ ఈమె కొన్నాళ్ల నుండీ స్క్రీన్ పై కనిపించడం లేదు. దీంతో ఈమె గురించి రకరకాల వార్తలు వచ్చాయి.’గీతిక పరిస్థితి దయనీయంగా మారింది’ అంటూ రకరకాలుగా ప్రచారం జరిగింది. వాటి పై తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతిక స్పందించింది.

ఆమె మాట్లాడుతూ.. “2012వ సంవత్సరంలో ఓ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా మాకు పెద్ద ప్రమాదం జరిగింది. నా ఎడమ కాలు, చేయి విరిగిపోయాయి. మా నాన్న గారికి కూడా చాలా గాయాలు అయ్యాయి. మేమంతా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అటు తర్వాత నేను ఓ సినిమాతో పాటు పలు సీరియల్స్‌లో కూడా నటించాను.కానీ నేను ఆశించినంత గుర్తింపుని అవి తీసుకురాలేదు. ఇక మా పేరెంట్స్ దుబాయ్‌ లో ఉద్యోగం రావడంతో వెళ్లారు. దాంతో నేను మా అమ్మమ్మ-తాతయ్య ల దగ్గర పెరిగాను.

ఇప్పటికీ వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. నేను షూటింగ్‌లకు వెళ్లేప్పుడు నాతో రావడానికి వాళ్ళు ఇబ్బంది పడేవారు. అందుకే నేను బ్రేక్‌ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ టైంలో నా గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ‘గీతిక అవకాశాలు అన్నింటినీ కోల్పోయింది. నేను ఓ షోకి వెళ్తే అడుగు కూడా పెట్టనివ్వలేదు‘, ‘గీతిక గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు’ ఇలాంటి హెడ్డింగ్ లతో ఎన్నో వీడియోలు వచ్చేవి. అయితే మీరు వాటిని నమ్మాల్సిన పనిలేదు. అదంతా అసత్య ప్రచారం. అలాంటి వార్తలు వచ్చినట్టు నాకు కూడా తెలీదు. ప్రస్తుతం నేను ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదవుతున్నాను, ఇప్పటికీ డ్యాన్స్‌ని మర్చిపోలేదు. అది నా డి.ఎన్‌.ఏ లోనే ఉంది. మంచి పాత్రలు దొరికితే తప్పకుండా నటిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది గీతిక.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus