“అజ్ఞాతవాసి” (Agnyathavasi) అనే టైటిల్ తో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2018 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరువలేరు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆఖరి చిత్రంగా ప్రమోట్ చేయబడిన “అజ్ఞాతవాసి” (Agnyaathavasi) మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ దక్కించుకొని పవన్ కళ్యాణ్ కెరీర్లో కాక తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ప్రతి ఏడాది జనవరి 10న “అజ్ఞాతవాసి” సినిమాని గుర్తు చేసుకుని కనీసం ఒక్కసారైనా బాధపడతాడు.
అలాంటి “అజ్ఞాతవాసి”కి ఇప్పుడు హిట్ టాక్ రావడం అనేది సెన్సేషన్ అయ్యింది. అయితే.. అది పవన్ కళ్యాణ్ నటించిన తెలుగు “అజ్ఞాతవాసి” కాదు, కన్నడ “అజ్ఞాతవాసి”. థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకుల్ని మాత్రమే కాక మిగతా భాషల ఆడియన్స్ ను కూడా విశేషంగా ఆకట్టుకుంటూ సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. “సప్తసాగరాలు దాటి” (Sapta Sagaralu Dhaati) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు హేమంత్ (Hemanth M. Rao) ఈ చిత్రాన్ని నిర్మించారు.
చాలా ఏళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న కన్నడ సినిమా ఇండస్ట్రీకి “అజ్ఞాతవాసి” మంచి ఊతమిచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారట. మరి తెలుగులో ఎలాంటి టైటిల్ పెడతారు అనేది చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ థియేటర్లలో ఎవైలబుల్ ఉన్న ఈ సినిమాని ఆదరించండి అంటూ నిర్మాత హేమంత్ ట్విట్టర్ ద్వారా ఒకటికి పదిసార్లు కోరుకుంటున్నాడు.