Ahimsa Review In Telugu: అహింస సినిమా రివ్యూ & రేటింగ్!
June 2, 2023 / 05:53 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
అభిరామ్ దగ్గుబాటి (Hero)
గీతిక తివారీ (Heroine)
గీతిక తివారీ, (Cast)
తేజ (Director)
కిరణ్ (Producer)
ఆర్పీ పట్నాయక్ (Music)
సమీర్ రెడ్డి (Cinematography)
Release Date : జూన్ 02, 2023
ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు మనవడు, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు తనయుడు, సూపర్ సక్సెస్ ఫుల్ నటుడు విక్టరీ వెంకటేష్ కు కూడా కొడుకు వరస, పాన్ ఇండియన్ యాక్టర్ రాణా తమ్ముడు. ఇలా ఇంత భారీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. అతడు చేసిన ఓ పెద్ద తప్పు కారణంగా వేరేలా ప్రొజెక్ట్ అయ్యాడు అభిరామ్ దగ్గుబాటి. రామానాయుడు బ్రతుకున్న రోజుల్లోనే అభిరామ్ ను హీరో చేయాలని తపించారు. ఆ తర్వాత జరిగిన కొన్ని రచ్చల కారణంగా అభిరామ్ వెండి తెరంగేట్రం కాస్త లేటయ్యింది.
ఎట్టకేలకు తేజ దర్శకత్వంలో “అహింస” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అభిరామ్ దగ్గుబాటి. సినిమా ట్రైలర్ అయితే సినిమా మీద కనీస స్థాయి ఆసక్తి కూడా రేకెత్తించలేకపోయింది. మరి సినిమా పరిస్థితి ఏమిటి? అనేది చూద్దాం..!!
కథ: చిన్నప్పట్నుంచి కలిసి పెరిగిన బావామరదళ్లు రఘు (అభిరామ్ దగ్గుబాటి), అహల్య (గీతికా తివారీ). ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ కంటే బాధ్యత ఎక్కువ. సరిగ్గా నిర్చితార్ధం జరిగి.. త్వరలో పెళ్లి అనగా అహల్యపై అత్యాచారం జరుగుతుంది. చేసింది ఊరి పెద్ద కొడుకులు. వాళ్ళ మీద అహింసాత్మకంగా న్యాయ పోరాటం చేయాలనుకుంటాడు రఘు. అహింస పోరాటం అతడికి న్యాయాన్ని చేకూర్చిందా? అందుకోసం అతడు పడిన కష్టాలు ఏమిటి అనేది “అహింస” కథాంశం.
నటీనటుల పనితీరు: నటుడిగా అభిరామ్ ఇంకా బేసిక్స్ కూడా నేర్చుకోలేదు. చాలా సన్నివేశాల్లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో తెలియక బ్లాంక్ గా ఉండిపోయాడు. కాకపోతే.. యాక్షన్ బ్లాక్స్ లో మాత్రం పర్వాలేదనిపించుకున్నాడు. అభిరామ్ కి సినిమాలో హీరోగా పాత్ర కంటే ముందు.. నటుడిగా శిక్షణ అవసరం. గీతికా తివారీ మాత్రం తనదైన నటన & లిప్ సింక్ తో అలరించింది.
గ్లామర్ తోపాటు నటనతోనూ అలరించింది. రజత్ బేడీ ఓ మోస్తరుగా పర్వాలేదనిపించుకున్నాడు. సదా నటన బాగున్నప్పటికీ.. ఆమె పాత్రకు ఒక జస్టిఫికేషన్ లేకపోవడంతో ఆమె కష్టం వృధా అయ్యింది.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడిగా తేజ అప్డేట్ అవ్వలేకపోతున్నాడా లేక ఈ ప్రొజెక్ట్ కి ఇంతకుమించిన అవుట్ పుట్ అవసరం లేదనుకున్నాడా అనేది అర్ధం కాదు. ఎందుకంటే.. ఒక రాజు ఒక రాణి లాంటి సింపుల్ పోలిటికల్ ఫిలిమ్ తో ప్రేక్షకుల్ని అలరించిన తేజ.. తన స్ట్రాంగ్ బేస్ అయిన లవ్ జోనర్ లో అహింసతో మాత్రం ఆకట్టుకోలేకపోవడం ఆశ్చర్యకరం. ఒక దర్శకుడిగా, ఒక కథకుడిగా ఆయన మెప్పించలేకపోయాడు.
ఆర్పీ పట్నాయక్ పాటలు కానీ.. అనూప్ రూబెన్స్ నేపధ్య సంగీతం కానీ అలరించలేకపోయాయి. సినిమాటోగ్రఫీ & యాక్షన్ బ్లాక్స్ కంపోజ్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ & ఎడిటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే సినిమాకి మైనస్ గా మారిన మెయిన్ ఎలిమెంట్స్ అవే.
విశ్లేషణ: దర్శకుడు తేజ వీకేస్ట్ వర్క్ (Ahimsa) “అహింస”. మీడియా ఇంటరాక్షన్ లో ఆయన స్వయంగా పేర్కొన్నట్లు ఈ అహింస తేజ పెట్టిన హింస.