Aishwarya Arjun: ఐశ్వర్య అర్జున్ ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్ ఎంటో తెలుసా?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు యాక్షన్ హీరో అర్జున్ ఒకరు. స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అర్జున్ గత కొద్దిరోజుల క్రితం తన పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ కు ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు హీరో ఉమాపతితో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపించారు.

ఐశ్వర్య గత కొంతకాలంగా ఉమాపతితో ప్రేమలో ఉన్నారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల అంగీకారంతో పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. వీరి నిశ్చితార్థం చెన్నైలో సినీ సెలబ్రిటీలు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నటువంటి ఈ జంట గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.

ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థంలో ధరించిన నగలు దుస్తుల గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈమె ఎంగేజ్మెంట్ రింగు విషయానికి వస్తే ఈ రింగ్ కోసం భారీ స్థాయిలోనే డబ్బు ఖర్చు చేశారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రింగ్ బర్మా నుంచి తెప్పించారని సమాచారం. ఈ నిశ్చితార్ధ రింగు 5 క్యారెట్ గోల్డ్ తో బ్లడ్ రూబీ రంగుతో తయారు చేయించారట. దీని విలువ సుమారు 20 లక్షల వరకు ఉంటుందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కేవలం ఎంగేజ్మెంట్ రింగ్ కోసమే అన్ని లక్షలు ఖర్చు చేశారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఐశ్వర్య (Aishwarya Arjun) ఇదివరకే పలు కన్నడ తమిళ భాష సినిమాలలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus