Aishwarya Rai: నీ రాకతో నా జీవితంలో వెలుగులు!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె వయసు పెరుగుతున్న కూడా అందాన్ని కూడా పెంపొందించుకుంటూ ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈమె వయసు 50 సంవత్సరాలు అంటే కూడా ఎవరు నమ్మరు. ఇలా తన అందం నటన నైపుణ్యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి ఐశ్వర్యారాయ్ తాజాగా తన కుమార్తె ఆరాధ్య గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్య తన కుమార్తె గురించి మాట్లాడుతూ.. ఆరాధ్యనే నా జీవితం నేను బ్రతికున్నది తన కోసమే తన రాకతో నా జీవితంలో వెలుగులు వచ్చాయి. ఈ అనంత విశ్వం కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు అత్యంత విలువైనటువంటి నా ఆరాధ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఈమె తన కూతురుపై ఉన్నటువంటి ప్రేమను మొత్తం తన మాటలలో తెలియజేస్తూ తన కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇలా ఐశ్వర్య (Aishwarya Rai) తన కూతురిపై ఉన్న ప్రేమను మొత్తం బయట పెట్టడంతో అభిమానులు కూడా కూతురి పట్ల ఈమె చూపించే ప్రేమకు ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. గతంలో ఈ వార్తలను అభిషేక్ తీవ్రంగా ఖండించారు. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ ఒంటరిగా కనిపించడం తన పుట్టినరోజు కూడా అభిషేక్ కనిపించకపోవడంతో మరోసారి విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus