Aishwarya Ra: నందిని పాత్ర కోసం ఐశ్వర్య బదులు స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసిన మణిరత్నం?

టాలెంటెడ్ డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన మణిరత్నం చాలా కాలంగా సినిమాలు తీయడం లేదు. అయితే ఇటీవల భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా పాన్ ఇండియా లెవెల్ లో పోనియన్ సెల్వన్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తీ, విక్రమ్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మణిరత్నం కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషన్ పనులను వేగవంతం చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న మణిరత్నం సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో పొన్నియన్ సెల్వన్ సినిమాలో నందిని పాత్ర కోసం వేరే ఎవరినైనా సంప్రదించారా ? అని విలేకరి ప్రశ్నించగా.. మణిరత్నం స్పందిస్తూ.. అవునని సమాధానం చెప్పాడు. ఈ సినిమాలో నందిని పాత్ర కోసం మొదటగా అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఐశ్వర్యరాయ్ ని సంప్రదించాల్సి వచ్చిందని మణిరత్నం వెల్లడించాడు.

ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ లుక్ చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఐశ్వర్యరాయ్ ఇలాంటి మహారాణి గెటప్ లో కనిపించనుంది.ఇక సెప్టెంబర్ 30వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో విడుదల కానుంది మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus