Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ చేతులు చూసి.. షాక్ అవుతున్న నెటిజన్లు..!

సీనియర్‌ స్టార్ కమెడియన్ అయినటువంటి శ్రీ లక్ష్మి అందరికీ సుపరిచితమే..! ఇలా చెప్తే అర్థం కాదేమో.. ‘అబ్బ దబ్బ జబ్బ’ అంటూ పాపులర్ అయిన నటి అంటే ఇట్టే గుర్తుపడతారేమో. వందల సినిమాల్లో నటించి పాపులర్ అయిన ఆమె మేనకోడలు కూడా స్టార్ హీరోయిన్ అయ్యింది అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. ఆమెనే ఐశ్వర్య రాజేష్.అవును ఎక్కువగా తమిళ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఈమె తెలుగమ్మాయే. ఆమె తండ్రి కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు.

అయితే ఆయన చిన్నతనంలోనే అనారోగ్య సమస్యలతో మరణించడంతో కుటుంబ భారమంతా ఐశ్వర్య రాజేష్ పై పడింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఐశ్వర్య రాజేష్ తన సొంత టాలెంట్ తోనే క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ పాపులర్ అయిన ఈమె ఇటీవల ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఫొటోల్లో ఐశ్వర్య రాజేష్ చేతులు చూస్తే ఓ బాడీ బిల్డర్ ను తలపిస్తున్నాయి. ఆమె ఫేస్ లో కూడా ఏదో ఛేంజ్ కనిపిస్తుంది. ఏదైనా సినిమా కోసం ఈమె జిమ్ లో వర్కౌట్లు చేసి ఇలా తయారయ్యి ఉండొచ్చు అని అంతా భావిస్తున్నారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus