తన ఇంట్లో చోరీ చేసిన వాళ్ల గురించి రజినీ కాంత్ కూతురు ఏం చెప్పారంటే..?

సూపర్ స్టార్ రజినీ కాంత్ పెద్ద కుమార్తె ఐశ్యర్య ఇంట్లో భారీ చోరీ జరిగింది.. దీని గురించి ఆమె చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. పెద్ద మొత్తంలో వజ్రాలు, నగలు దొంగిలించారనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.. తమిళ్, తెలుగు ఇండస్ట్రీ వర్గాల వారిలో దీని గురించే చర్చలు జరుగుతున్నాయి.. తన ఇంటి లాకర్‌లో ఉన్న లక్షలాది రూపాయల విలువైన నగలు, డైమండ్ ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఐశ్యర్య..

చెన్నై, తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు ఐశ్యర్య.. వజ్రాలు, అరమ్ నెక్లెస్‌తో పాటు 60 సవరీల గాజులు కనిపించకుండా పోయాయని, వాటి విలువ లక్షల్లో ఉంటుందని.. తన ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులే అపహరించి ఉంటారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.. 2019లో తన చెల్లెలు సౌందర్య పెళ్లికి ఆ నగలను ఉపయోగించిన తర్వాత వాటిని తన లాకర్‌లో ఉంచినట్లు ఐశ్వర్య తెలిపారు.. కొద్ది కాలం క్రితం హీరో ధనుష్, ఐశ్వర్య దంపతులు విడిపోయి వేరు వేరుగా ఉంటున్నారు..

వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.. పిల్లల్లు ప్రస్తుతం ఐశ్యర్యతోనే ఉంటున్నారని తెలుస్తోంది.. 2019లో తన చెల్లెలు సౌందర్య పెళ్లికి ధరించిన నగలను.. ఆ తర్వాత భద్రంగా తన లాకర్‌లో ఉంచానని.. 2021 ఆగస్టు వరకు ఆ లాకర్ సెయింట్ మేరీస్ రోడ్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఉంచానని.. ధనుష్‌తో కలిసి ఉన్న సమయంలో వాటిని అక్కడికి మార్చానని అన్నారు.. తర్వాత 2022 లో తన తండ్రి రజినీ కాంత్ ఇంటికి షిఫ్ట్ చేశానని..

ఆ లాకర్‌కి సంబంధించిన తాళాలు అపార్ట్‌‌మెంట్‌లో ఉంటాయని.. వాటి గురించి తన ఇంట్లో పనిచేసే ముగ్గురికి కూడా తెలుసని చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న తేనాంపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురినీ విచారిస్తున్నారు.. ఇదిలా ఉంటే.. చాలా కాలం తర్వాత ఐశ్వర్య ‘లాల్ సలామ్’ అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నారు.. రజినీ ఇందులో ఓ గెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus