Ajay Devgan: ‘ఖైదీ’ రీమేక్ స్టోరీలా లేదే..!

ఈ మధ్యకాలంలో సౌత్ లో హిట్ అయిన చాలా సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తి నటించిన ‘ఖైదీ’ సినిమాను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ రూపొందించిన ‘ఖైదీ’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. కేరళ, కర్ణాటకలో కూడా సినిమా బాగా ఆడింది. ఈ సినిమా రిలీజైన కొన్ని నెలలకే నటుడు, దర్శకుడు అజయ్ దేవగన్ సినిమా రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నారు.

ఆయనే ప్రధాన పాత్ర పోషిస్తూ.. డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి ‘భూలా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేశారు. ఇది చూసిన సౌత్ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ‘ఖైదీ’లో ఎక్కడా కూడా హీరోయిన్ కనిపించదు. తన భార్య గురించి కార్తి చిన్న స్టోరీ మాత్రమే చెబుతాడు. ఆమెకి సంబంధించి ఎలాంటి సీన్స్ కనిపించవు. హీరో బ్యాక్ గ్రౌండ్ స్టోరీ తెరపై ఎక్కడా కనిపించదు.

హీరో ఫ్లాష్ బ్యాక్ పాయింట్ తో ఖైదీకి ప్రీక్వెల్ తీయాలని దర్శకుడు లోకేష్ భావిస్తున్నారు. ఫ్యూచర్ లో ఆ కథతో సినిమా ఉండొచ్చు. అయితే ఈలోగానే.. అజయ్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీని ‘భూలా’ సినిమాలో చూపించినట్లు ఉన్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అజయ్ దేవగన్ పక్కన హీరోయిన్ కనిపించింది. ఆ పాత్రను అమలాపాల్ పోషించింది. వీరిద్దరి మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించారు.

పాట చివర్లో హీరోయిన్ కోసం వస్తోన్న రౌడీలను హీరో ఎదుర్కోవడానికి సిద్ధపడే సన్నివేశాలు చూపించారు. లోకేష్ ఫ్యూచర్ లో ఒక సినిమాగా తీయాలనుకున్న పాయింట్ ను అజయ్ ఈ సినిమాలో చిన్న ఫ్లాష్ బ్యాక్ రూపంలో చూపించారు. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఇంకా మార్పులు చేసినట్లున్నారు. ఈ సినిమాను త్రీడీలో తెరకెక్కిస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus