Maidaan: ఫుట్‌బాల్‌ హీరో కథ చూడటానికి సిద్ధంకండి!.. డేట్‌ ఫిక్స్‌ చేశారు!

  • April 1, 2023 / 06:16 PM IST

బాలీవుడ్‌ అంటే.. ఎవరికీ భయపడని వుడ్‌ అనేవారు. అంటే సినిమాల ఫలితాలు, పక్క పరిశ్రమల రికార్డులు ఇలా వేటినీ పట్టించుకోకుండా తమదైన శైలిలో సినిమాలు చేస్తూ వచ్చేవారు అక్కడ. అయితే కరోనా తర్వాత పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్‌ బాగా డౌన్‌లోకి వెళ్లిపోయింది. సినిమా సినిమాకు భయాలు కనిపిస్తున్నాయి. సరైన విషయం దక్కితే చాలు, రికార్డుల సంగతి తర్వాత అనుకుంటున్నారు. అయితే రియల్‌ బాలీవుడ్‌ అంటే జీవిత కథా చిత్రాలు. మాస్‌ సినిమాల మధ్యలో లైఫ్‌ సినిమాలు చేసి వావ్‌ అనిపించారు. తాజాగా మరోసారి అదే ప్రయత్నం జరిగింది. అదే ‘మైదాన్‌’.

మన దేశానికి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా ‘మైదాన్‌’ అనే సినిమాను రూపొందించారు. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రధారి. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. భారతదేశానికి ఫుట్‌బాల్‌ ఆటలో రికార్డులు సృష్టించిన ఒక అసామాన్య హీరో కథను, అతని పోరాటాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నామని సినిమా టీమ్‌ వెల్లడించింది.

ఫుట్‌బాల్‌ అంటే బూట్లు వేసుకుంటారు అనేది కనీస విషయం. అలాంటిది కాళ్లకు బూట్లు లేకుండా ఫుట్‌బాల్‌ ఆడిన రోజుల నాటి నుండి అదిరిపోయే విజయాలు సాధించి ఆటకు స్వర్ణయుగంగా మార్చిన విధానం ఈ సినిమాలో చూడొచ్చు. 1950-62 మధ్య కాలంలో జరిగిన సంఘటలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇక సినిమాలో కీర్తి సురేష్‌, ప్రియమణి తదితరులు ఇతర కీలక పాత్రధారులు.

జూన్‌ 23న ఈ సినిమాను (Maidaan) విడుదల చేస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజిలో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేస్తారు. ఇటీవల కాలంలో అజయ్‌ దేవగణ్‌ సినిమాలు బాలీవుడ్‌లో మంచి విజయాలు అందుకుంటున్నాయి. ‘దృశ్యం 2’, ‘భోళా’ సినిమాలతో బాలీవుడ్‌లో భారీ విజయాలు అందుకుంటున్నాడు. ఇప్పుడు ‘మైదాన్‌’ సినిమా కూడా మంచి విజయం అందుకుంటే బాలీవుడ్‌ ఫుల్‌ ఖుష్‌ అని చెప్పొచ్చు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus