షాకింగ్.. అజిత్ షాలిని విడాకులు తీసుకోబోతున్నారా? క్లారిటీ ఇదే!

అజిత్ కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ టాలీవుడ్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అతని హంబుల్ నేచర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అజిత్ సినిమా ఎలా ఉన్నా.. అతని కోసం సినిమా చూడాలనుకునే వారి సంఖ్య పెద్దదే. ఎక్కడికి వెళ్లినా అతనో పెద్ద స్టార్ అన్నట్టు ప్రవర్తించడు. చాలా ‘డౌన్ టు ఎర్త్’ అన్నట్టు ప్రవర్తిస్తాడు. ‘జనతా గ్యారేజ్’ లో ఎన్టీఆర్ ‘అరుదైన మొక్క’ అంటూ ఓ డైలాగ్ చెబుతాడు.

ఆ డైలాగ్ అజిత్ క్యారెక్టర్ గురించి చెప్పడానికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అజిత్ మాత్రమే కాదు అతని ఫ్యామిలీ కూడా అందరికీ సుపరిచితమే. అజిత్ భార్య షాలినికి ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు.కోలీవుడ్లో అజిత్- షాలిని ల జంటని అంతా క్యూట్ కపుల్, ఆదర్శ దంపతులు అని అంటుంటారు. అయితే ఈ జంట గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే.. త్వరలో అజిత్ – షాలిని విడాకులు తీసుకోబోతున్నారు అనేది ఆ షాకింగ్ న్యూస్.

వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఈ జంట ఈ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు ఆ వార్తల సారాంశం.2000 వ సంవత్సరంలో అజిత్ – షాలిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పటివరకు పిల్లలతో హ్యాపీగా కలిసున్న ఈ జంట..పెళ్ళైన 22 ఏళ్ళ తర్వాత విడాకులు తీసుకోవడం ఏంటి అంటూ అంతా చర్చించుకుంటున్నారు. అయితే ఈ రూమర్స్ కు అజిత్ – షాలిని లు చెక్ పెట్టారని చెప్పాలి.

ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి గడిపిన ఆనంద క్షణాలకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ లవ్ సింబల్ పెట్టింది షాలిని. దీంతో ఆ వార్తల్లో నిజం లేదని ఈమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే అని చెప్పాలి. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ‘తునీవు'(తెగింపు) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అజిత్. ఆ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేసిందని చెప్పాలి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus