బాలయ్య బోయపాటి ది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. సింహ , లెజెండ్ , అఖండ వంటి చిత్రాలతో ఒకదానికి మించి ఇంకోటి అన్నట్లుగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ ఇద్దరు మరోసారి సిల్వర్ స్క్రీన్ మీదకి అఖండ 2 సినిమాతో రాబోతున్నారు. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ .
Akhanda 2 Thaandavam
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాండవం సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 5.09 గం.లకు రిలీజ్ చేయనున్నట్లు అప్డేట్ ఇచ్చారు ఈ సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు. అయితే ఈ సాంగ్ రిలీజ్ కోసం PVR జుహు , ముంబై లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీంతో బాలయ్య అభిమానులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పటికే హిందీ ప్రమోషన్స్ లో భాగంగా నార్త్ చానెల్స్ లో అఖండ 2 పోస్టర్స్ & యాడ్స్ రూపంలో ప్రదర్శిస్తున్నారు. బీహార్ లో ఎన్నికల సమరం ముగియగా , రిజల్ట్స్ ప్రసారం అవుతున్న న్యూస్ చానెల్స్ లో వీటిని యాడ్ చేసి అఖండ 2 ని ప్రమోట్ చేస్తున్నారు. దీంతో బాలయ్య అభిమానులు “X” (ట్విట్టర్) లో ట్రెండ్ చేస్తున్నారు.
ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా , భజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ ని 14 రీల్స్ & ఇషాన్ సక్సేనా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ డిసెంబర్ లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు మేకర్స్.