మమ్ముట్టి తనయుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అన్ని భాషల్లోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు దుల్కర్. ఏడాదికి కనీసం 10కి పైగా సినిమాల్లో నటిస్తూ.. క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడు. అసలు ఇన్ని మంచి స్క్రిప్టులు ఎలా పడుతున్నాడు? అని మిగతా స్టార్స్ ఆశ్చర్యపోయేలా దుల్కర్ దూసుకుపోతున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే కెరీర్ ప్రారంభంలో దుల్కర్ కూడా నటన విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడట.
Dulquer Salmaan
ఈ విషయాన్ని తన ‘కాంత’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “గతంలో నాపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. కాలక్రమేణా అవి తగ్గుతూ వస్తున్నప్పటికీ ఆగడం లేదు. నా నటన గురించి కొంతమంది ఇప్పటికీ నెగిటివ్ గా మాట్లాడతారు. నాకు అసలు నటన రాదు అంటారు.లేకపోతే ‘ఇలా తప్ప వేరేలా నటించలేడా?’ అని అంటారు. సో విమర్శించేవాళ్ళని తప్పుబడుతూ నేను కూర్చోను.
కానీ నాకు ఆ కామెంట్స్ చూసినప్పుడు భయం వేస్తుంది. అందుకే నేను ‘నిజంగానే బాగా నటిస్తున్నానా? లేదా?’ అని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటాను. నాపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ను పాజిటివ్ గా మలుచుకోవడానికి ట్రై చేస్తాను. నా వరకు ఇంకా ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను. ఈ పాత్ర దుల్కర్ మాత్రమే చేయగలడు అనే నమ్మకం సంపాదించుకోవడానికి నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు. దుల్కర్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.