కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో టాలీవుడ్‌లో చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. నెలలు ఉంటుంది అనుకున్న ఆ వాయిదా… ఇప్పుడు సంవత్సరాలుగా మారుతోంది. పరిస్థితులు సద్దుమణిగేదాకా… సినిమాలు విడుదల చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు ఇలానే ఆలోచిస్తున్నాయి. అలాంటి సినిమాల్లో ‘అఖండ’ ఒకటి. మొన్నీమధ్య వరకు దసరాకు ఈ సినిమాను తీసుకొస్తారని వార్తలొచ్చాయి. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అలా అనిపించడం లేదు.
‘అఖండ’ సినిమా చిత్రీకరణ చివరిదశకొచ్చింది అని గత కొన్ని రోజులుగా చెబుతూనే ఉన్నారు. అయితే ఏవో చిన్న ప్యాచ్ వర్క్‌లు ఉంటాయిలే అనుకున్నారంతా. కానీ సినిమా టీమ్ నుండి వస్తున్న అప్‌డేట్‌లు చూస్తుంటే ప్యాచ్ వర్క్ కాదు… ఇంకా కొంత పార్ట్ షూటింగ్ ఉందని తెలుస్తోంది. పాట, కొన్ని సీన్స్ కోసం చిత్రబృందం గోవాకు వెళ్తున్నారని సమాచారం. ఇప్పటికే ఏయే ప్రాంతాల్లో షూట్ చేయాలో ఓ లెక్కేసుకున్నారట.
ఆ మధ్య వచ్చిన కొన్ని వార్తల ప్రకారం చూసుకుంటే… సినిమా దసరాకు తీసుకొస్తారని అన్నారు. ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో సినిమా రిలీజ్ పక్కా అన్నారు. అయితే చిత్రబృందం దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు షూటింగ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కొంతమంది అనుకున్నట్లుగా, బజ్ వచ్చినట్లుగా దసరాకు రావడం కష్టమే. బోయపాటి- బాలయ్య ఆలోచనలు ఎలా ఉన్నాయో మరి.