Akhanda2: అఖండ2 సినిమా ఆ రికార్డులను క్రియేట్ చేయనుందా?

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ 2021 సంవత్సరం డిసెంబర్ నెల 2వ తేదీన విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో విడుదలైన ఈ సినిమా 75 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని అఖండ క్లైమాక్స్ లో హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అఖండ2 మూవీ ఎప్పుడు విడుదలైనా రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండగా

తాజాగా థమన్ నుంచి అఖండ సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. శివరాత్రి రోజున హర హర మహాదేవ్ ఓం నమః శివాయ త్వరలోనే అఖండ2 సినిమాతో కలుద్దాం అని పేర్కొన్నారు. థమన్ చేసిన ఈ ట్వీట్ కు 15000కు పైగా లైక్స్ వచ్చాయి. అఖండ2 సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. అఖండ సినిమాను నిర్మించిన నిర్మాతలే ఈ సినిమాను కూడా నిర్మించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బోయపాటి శ్రీను ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులను మొదలుపెట్టారు. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా అటు బోయపాటి శ్రీను ఇటు బాలయ్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని కొంతమంది చెబుతున్నారు.అఖండ2 మూవీ కథ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

అఖండ2 సినిమాలో ప్రధానంగా అఘోర పాత్ర ఉండనుందని బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. అఖండ2 మూవీ వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. అఖండ2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus