Akhil: ఏజెంట్ సినిమాతో మరో హిట్ కొట్టడానికి సిద్ధమైన అఖిల్..ఈ సారి హిట్ పక్కా?

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అఖిల్ సినిమా ద్వారా వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు. అయితే ఈయన నటించిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తన తదుపరిచిత్రాలు మజ్ను హలో వంటి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాయి.ఇక అఖిల్ కెరియర్ అయిపోయింది అనుకుంటున్నా సమయంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా హిట్ కొట్టాడు .

ఈ సినిమాలో పూజా హెగ్డేతో కలిసి నటించిన అఖిల్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఇక ఈ సినిమా తర్వాత ఈయన ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇకపోతే ఇప్పటికే ఏ సినిమా నుంచి విడుదలైన అఖిల్ లుక్ చూస్తే మాత్రం ఈసారి అఖిల్ తప్పకుండా మరో హిట్ కొట్టేలా ఉన్నారని అర్థమవుతుంది. అఖిల్ ఇది వరకు సినిమాలో మాదిరి కాకుండా ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో , కండలు తిరిగిన శరీరంతో ఉన్న లుక్ ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఇలా ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయడానికి నిర్వాహకులు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈనెల 15వ తేదీ ఈ సినిమా టీజర్ విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాని వచ్చే నెల 12వ తేదీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ చూస్తుంటే సినిమాపై కూడా భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాని ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus