అఖిల్ మాస్ హీరో అయిపోవడం గ్యారెంటీ అంటున్నారుగా..!

ప్రేమకథా చిత్రాలు చేసి బ్లాక్ బస్టర్లు కొట్టడంలో అక్కినేని హీరోలకు తిరుగులేదు. అయితే మాస్ సినిమాలు చేసి వారి ఫ్యాన్స్ ఆనందం తీర్చడంలో మాత్రం వారు వెనకపడే ఉన్నారు. అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున లు.. అప్పుడప్పుడు మాస్ సినిమాలు చేసి కొంతమేర అక్కినేని అభిమానుల్ని సంతోషపరిచేవారు. అయితే థర్డ్ జనరేషన్ హీరోలైన నాగ చైతన్య, అఖిల్ లు మాత్రం ఈ విషయంలో పూర్తిగా వెనుకపడి ఉన్నారు. నాగ చైతన్య చేసిన మాస్ ప్రయత్నాలు అన్నీ నిరాశపరిచాయి.

పైగా నాగ చైతన్య మాస్ పాత్రలకు సెట్ అవ్వడు అనే ముద్ర కూడా పడిపోయింది. ఇక అఖిల్ అయితే మొదటి చిత్రంతో బాగానే ట్రై చేసాడు కానీ.. ‘అఖిల్’ చిత్రం మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో అతను మాస్ పాత్రలకు దూరంగా ఉంటూ.. ‘హలో’ ‘మిస్టర్ మజ్ను’ వంటి క్లాస్ సినిమాలు చేశాడు. అవి కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. ఇప్పుడు అఖిల్ కు హిట్టు దక్కితే గొప్ప అన్నట్టు తయారయ్యింది పరిస్థితి.

‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రం కచ్చితంగా హిట్ అయ్యే విధంగానే కనిపిస్తుంది. ఇక అఖిల్ 5వ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చెయ్యబోతున్నట్టు ఈ మధ్యనే అధికారిక ప్రకటన వచ్చింది. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్స్ అందించడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి సిద్ధహస్తుడు. కాబట్టి అఖిల్ 5వ చిత్రం కచ్చితంగా అక్కినేని అభిమానుల ఆకలి తీరుస్తుందనే నమ్మకంతో వారున్నట్టు సోషల్ మీడియాలో వారి సందడి చూస్తే స్పష్టమవుతుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus