Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్.. సోషల్ మీడియాలో పొటోలు వైరల్!
- June 6, 2025 / 11:48 AM ISTByFilmy Focus Desk
అక్కినేని ఇంట్లో పెళ్లి సందడి ఘనంగా జరుగుతోంది. నాగార్జున (Nagarjuna) చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ (Akhil Akkineni) వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతూ తన ప్రేయసి జైనబ్ రవ్జీ మెడలో మూడు ముడులు వేసి వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంట్లో శుక్రవారం వేకువజామున మూడు గంటలకు వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు, కొంతమంది సినీ తారలు వివాహనికి హాజరయ్యారని సమాచారం.
Akhil Wedding Photos

ఈ మేరకు వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. అఖిల్, జైనబ్ రవ్జీ పెళ్లికి పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) – సురేఖ దంపతులు, రామ్ చరణ్ (Ram Charan) – ఉపాసన, దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel), క్రికెటర్ తిలక్ వర్మ తదితరులు హజరైనట్లు తెలుస్తోంది. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ – జైనబ్ రిసెప్షన్ వేడుక జరగనుందని సమాచారం. పెళ్లి అనంతరం జరిగిన బరాత్‌లో నాగార్జున, నాగచైతన్య (Naga Chaitanya) హుషారుగా పాల్గొన్న ఫోటోస్, వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.




















