Mitraaw Sharma, Akhil: ఈవారం అఖిల్ అందుకే కెప్టెన్ అయ్యాడు..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో అషూరెడ్డి సంచాలక్ గా మరోసారి ఫెయిల్ అయ్యింది. అసలు సంచాలక్ గా అషూరెడ్డికి అస్సలు కలిసిరావడం లేదనే చెప్పాలి. హౌస్ లో 8వ వారం కెప్టెన్సీ టాస్క్ లో అషూరెడ్డిని సంచాలక్ గా పెట్టాడు బిగ్ బాస్. కెప్టెన్సీ పోటీదారులు బీకర్స్ వెనకాల నుంచుని ఉంటే, వారికి మద్దతు తెలిపే వారు, రోప్ హర్డల్స్ ని దాటుకుంటూ వచ్చి రంగు నీళ్లు బీకర్స్ లో నింపాలి. ఇలా ప్రతి రౌండ్ లో ఎవరి బీకర్ లో అయితే తక్కువ ఉంటాయో వాళ్లు ఎలిమినేట్ అవుతూ వస్తారు. ఇక్కడే అషూరెడ్డిని సంచాలక్ గా పెట్టారు. మరో మేటర్ ఏంటంటే, హౌస్ మేట్స్ రంగునీళ్లు తీసుకుని వెళ్లే గ్లాస్ కి కన్నాలు ఉంటాయి.

Click Here To Watch NOW

ఇక్కడే తెలివిగా హౌస్ మేట్స్ మొదటి రౌండ్ లో గ్లాస్ లో గ్లాస్ పెట్టుకుంటూ వెళ్లారు. నటరాజ్ మాస్టర్ అఖిల్ కి, అరియానా అఖిల్ కి, బాబాభాస్కర్ కి, బిందుమాధవి శివకి, హమీదా అనిల్ కి సపోర్ట్ చేస్కుంటూ వెళ్లారు. అస్సలు మిత్రా బీకర్ లో ఒక్కరు కూడా నీళ్లు పోయలేదు. మిత్రాశర్మాకి హౌస్ లో ఎవరూ కూడా సపోర్ట్ చేయలేదు. దీంతో చాలా అప్సెట్ అయ్యింది. అయితే, పక్కనే ఉన్న అఖిల్ ఇది గమనించి మొదటి రౌండ్ లో మిత్రాని కాపాడేందుకు తన బీకర్ లో వాటర్ ని పోశాడు. కానీ, ఇక్కడే హౌస్ మేట్స్ పెద్ద రచ్చ చేశారు. మొదటి రౌండ్ లో శివని అవుట్ అయినట్లుగా అషూరెడ్డి ప్రకటించేసింది.

హౌస్ మేట్స్ మాత్రం కొంతమంది గ్లాస్ లో గ్లాస్ పెట్టుకుని మరీ నీళ్లు పోశారని, సంచాలక్ గా పట్టించుకోలేదని చెప్పారు. దీంతో అషూరెడ్డి ఆలోచనలో పడింది. మరోసారి మొదటిరౌండ్ ని పెడతానని చెప్పింది. ఇక ఇక్కడే అఖిల్, బాబాభాస్కర్ కాసేపు ఆర్గ్యూమెంట్ చేశారు. మొదటి రౌండ్ క్యాన్సిల్ చేస్తున్నానని, యాంకర్ శివని మళ్లీ గేమ్ ఆడమని చెప్పింది అషూరెడ్డి. మరోసారి గేమ్ ని ఫస్ట్ నుంచీ ప్రారంభించారు. ఇక్కడే బిందుమాధవి శివకి సపోర్ట్ చేస్తూ నీళ్లు తెచ్చిపోసింది. మిత్రా శర్మా బీకర్ ఖాళీగా ఉంది. అఖిల్ కూడా కొద్దిగా సాయం చేసినా సరిపడా నీళ్లు పోయలేకపోయాడు.

అందుకే ఫస్ట్ రౌండ్ లోనే మిత్రా శర్మా అవుట్ అయ్యింది. వాష్ రూమ్ లోకి వెళ్లి చాలాసేపు తనకి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదని బాధపడింది. అప్సెట్ అయ్యింది. అఖిల్ సాయం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇదే విషయాన్ని అఖిల్ కి చెప్పుకుని ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ హగ్ ఇచ్చింది. ఇక ఫైనల్ రౌండ్ వరకూ నిల్చుని బీకర్ ని నింపుకుని అఖిల్ కెప్టెన్ గా నిలిచాడు. ఈవారం మరోసారి ఇమ్యూనిటీని సాధించాడు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus