Most Eligible Bachelor Trailer: అఖిల్ ఈసారి మాత్రం హిట్టు కొట్టేలానే ఉన్నాడుగా..!

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా.. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘జిఎ2 పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌ పై బన్నీ వాసు, ద‌ర్శ‌కుడు వాసు వర్మ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇక సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు రావడం మొదలుపెట్టిన నేపథ్యంలో అక్టోబర్ 15న దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఆల్రెడీ ప్రకటించారు.

ఇందులో భాగంగా ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేసింది చిత్ర బృందం.తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ‘మన లైఫ్ పార్ట్నర్ తో కనీసం 9000 నైట్స్ కలిసి పడుకోవాలి.. అంతలా వెకేషన్స్ కు వెళ్ళాలి. అన్నిటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటివాడెవడు?’ అంటూ హీరోయిన్ పూజా హెగ్డే పలికే రొమాంటిక్ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఆమె ఈ చిత్రంలో స్టాండప్ కమెడియన్ పాత్రని పోషిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆమె ఈ డైలాగ్ పలికినట్టు స్పష్టమవుతుంది. ‘ఒక అబ్బాయి లైఫ్ లో 50శాతం కెరియర్.. 50 శాతం మ్యారీడ్ లైఫ్.

మ్యారీడ్ లైఫ్ బాగుండాలి అంటే కెరియర్ కూడా బాగుండాలి కదా’ అంటూ హీరో అఖిల్ పలికే డైలాగ్ కూడా బాగుంది. ట్రైలర్ లో ‘జాతి రత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా అలాగే తెలుగమ్మాయి ఈషా రెబ్బా వంటి వారు కూడా కనిపించడం విశేషం. ట్రైలర్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు లవ్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్ ఇలా అన్ని అంశాలు ఉన్నాయి.గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అని చెప్పాలి. ఈసారి అయితే అఖిల్ హిట్టు కొట్టెలానే ఉన్నాడు. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!


హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus