స్టేజ్ పై పాట పాడిన అఖిల్.. పలకరించిన మోనాల్..!

బిగ్ బాస్ సీజన్ 4 సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణం ఒక రకంగా మోనాల్ అండ్ అఖిల్ నడిపిన ఫ్రెండ్షిప్ స్టోరీ అనే చెప్పాలి. మోనాల్ ఎలిమినేట్ అయినపుడు, అలాగే ఫినాలేలో అఖిల్ రన్నరప్ అయినపుడు ఇద్దరూ కూడా ఎమోషనల్ గా బాగా ఫీల్ అయ్యారు. అయితే, ఆ తర్వాత అఖిల్ తన పనుల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. అలాగే మోనాల్ ఐటామ్ సాంగ్స్ లో డ్యాన్స్ చేస్తూ, డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

ఈ టైమ్ లో సుమ నిర్వహిస్తున్న స్టార్ మ్యూజిక్ షోలో ఇప్పుడు వీరిద్దరూ కలవబోతున్నారా అనేది ఆసక్తిగా మారింది. రీసంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో అఖిల్ ఏమై పోయావే అంటూ పాట పాడుతుంటే, మోనాల్ అఖిలూ.. అంటూ ఆడియో ద్వారా పలకరించింది. ఒక్కసారి కళ్లు మూసుకో అంటూ సుమ స్టేజ్ దగ్గర మోనాల్ ని చూపించినట్లుగా ప్రోమోని కట్ చేశారు. మోనాల్ నుంచి అఖిల్ కి ఎలాంటి సర్ ప్రైజ్ రాబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

బిగ్ బాస్ టీమ్ మేట్స్ పార్టిసిపేట్ చేసిన ఈ షోలో నోయల్ , లాస్య, హారిక ముగ్గురూ ఒక టీమ్ గా ఉంటే, సోహైల్ , అఖిల్, మెహబూబ్ ముగ్గురూ మరో టీమ్ గా ఉన్నారు. మరి ఈ స్పెషల్ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందనేది చూడాలి.


మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus