అక్కినేని అఖిల్ కి ఇప్పటివరకు సరైన హిట్టు పడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అఖిల్’ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తరువాత వచ్చిన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాలు కూడా నిరాశనే మిగిల్చాయి. ఆ తరువాత గీతాఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేశారు. గతేడాది వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. సినిమా ఫస్ట్ కాపీ రెడీగా ఉన్నప్పటికీ ఇప్పట్లో థియేటర్లలో సినిమా వచ్చేలా కనిపించడం లేదు.
రీసెంట్ గా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ అలా చేస్తే అఖిల్ కెరీర్ కి మంచిది కాదనే ఉద్దేశంతో వెనక్కి తగ్గారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దసరా రేసులో నిలపబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దసరా సీజన్లో పోటీ కాస్త గట్టిగానే ఉండేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా కూడా దసరాకి వస్తుందని అంటున్నారు.
నిజానికి దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ సినిమా రావాల్సింది కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బ పడడంతో ఆ సమయానికి సినిమాను సిద్ధమా చేయలేమని వాయిదా వేసేశారు. దీంతో ఆ ఖాళీని ‘ఆచార్య’, ‘అఖండ’ సినిమాను భారీ చేయబోతున్నాయి. మరి చిరు, బాలయ్య సినిమాల మధ్య అఖిల్ తన సినిమాను రిలీజ్ చేసి నిలవగలడా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!