Akira Nandan: అకీరా నందన్ కొత్త లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Ad not loaded.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా పవన్ కొత్త సినిమాల షూటింగ్ త్వరలో మొదలుకానుంది. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కు యూత్ లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. అకీరా నందన్ సినీ ఎంట్రీ కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అకీరా నందన్ సినిమాల్లోకి వస్తే సక్సెస్ సాధించడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ స్థాయిలో అకీరా కూడా మెప్పించే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చదువుకే ప్రాధాన్యత ఇస్తున్న అకీరా సినీ ఎంట్రీ గురించి స్పష్టత రావాల్సి ఉంది. రేణు దేశాయ్ అకీరా, ఆద్య ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఒక ఫోటోలో మాత్రం అకీరా ఫేస్ క్లియర్ గా కనిపిస్తుండగా అకీరా కొత్త లుక్ ఫిదా అయ్యేలా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మాస్ సినిమాలతో అకీరా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ కచ్చితంగా షేక్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అకీరా, ఆద్య ఫోటోలతో రేణు దేశాయ్ చేసిన పోస్ట్ కు భారీ స్థాయిలో లైక్స్ వచ్చాయి. త్వరలో పవన్ నట వారసుని ఎంట్రీ గురించి స్పష్టత వస్తుందేమో చూడాల్సి ఉంది.

పవన్, అకీరా నందన్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే చూడాలని ఉందని మరి కొందరు చెబుతున్నారు. పవన్ అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. సినిమాల విషయంలో అకీరా మనసులో ఏముందనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది. అకీరా కెరీర్ విషయంలో ఏ విధంగా ముందుకు వెళతారో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus