’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ తర్వాత యాంకర్ ప్రదీప్ (Pradeep Machiraju) హీరోగా తెరకెక్కిన సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi). దీపిక పిల్లి (Deepika Pilli) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని నితిన్ – భరత్ డైరెక్ట్ చేశారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. మొదటి రోజు సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ మొదటి రోజు ఎక్కువ టికెట్లు తెగలేదు. ఓ మోస్తరు ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ 2వ రోజు, 3వ రోజు సినిమా బాగా పికప్ అయ్యింది.
3వ రోజు ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో డబుల్ కలెక్ట్ చేసింది.4వ రోజు కూడా డీసెంట్ అనిపించింది.అయితే 5వ రోజు దారుణంగా పడిపోయాయి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.59 cr |
సీడెడ్ | 0.25 cr |
ఆంధ్ర | 0.64 cr |
ఏపీ + ఆంధ్ర (టోటల్) | 1.48 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.24 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.72 cr |
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) చిత్రానికి రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.1.72 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.65 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి సోమవారం అంబేద్కర్ జయంతి హాలిడే వరకు సినిమా బాగానే కలెక్ట్ చేసింది. కానీ 5వ రోజు మంగళవారం నాడు అమాంతం పడిపోయింది. మరి రాబోయే రోజుల్లో ఎలా కలెక్ట్ చేస్తుందో చూడాలి.