యాంకర్ ప్రదీప్ కి (Pradeep Machiraju) బుల్లితెర పై ఉన్న క్రేజ్ అందరికీ తెలుసు. ముఖ్యంగా లేడీస్ లో, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇతను బిగ్ స్క్రీన్ పై కూడా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా మారి ఆల్రెడీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’అనే సినిమా చేశాడు. అది కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇక రెండో ప్రయత్నంగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) చేశాడు. నితిన్ – భరత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ రిలీజ్ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది.
కానీ బిజినెస్ భారీగా ఏమీ జరగలేదు. టీజర్, ట్రైలర్ వంటివి బాగానే ఉన్నాయి. ఒకసారి ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను ఒకసారి గమనిస్తే :
నైజాం | 1.20 cr |
సీడెడ్ | 0.30 cr |
ఆంధ్ర | 2.00 cr |
ఏపీ + ఆంధ్ర (టోటల్) | 3.50 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.30 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 3.80 cr |
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రానికి రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘జాక్’ (Jack) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) వంటి క్రేజీ సినిమాల నడుమ ఈ సినిమా ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.