సమయాన్ని కథలుగా మార్చి తనకి టైమ్ కలిసొచ్చేలా చేసుకున్న డైరక్టర్ విక్రమ్ కుమార్. అతని దర్శకత్వంలో అక్కినేని ప్రిన్స్ అఖిల్ హిట్ ట్రాక్ ఎక్కాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో అక్కినేని నాగార్జున నిర్మించిన హలో మూవీ మంచి కలక్షన్స్ రాబట్టడంతో ఉత్సాహంతో అఖిల్ తన నెక్స్ట్ సినిమాని వెంటనే ప్రారంభిస్తానని చెప్పారు. తన నెక్స్ట్ సినిమా వివరాలను జనవరి 10 న వెల్లడిస్తానని అన్నారు. కానీ కుదరలేదు. మంచి కథకోసం రెండు నెలలలుగా అనేక కథలను విన్నారు. చివరికి ఒక కథకి ఒకే చెప్పారు. ఆ విషయాన్నీ నిన్న అంటే ఆదివారం.. ఉగాది నాడు అక్కినేని అభిమానులకు అఖిల్ చెప్పారు.
తాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రకటించారు. వరుణ్ తేజ్, రాశీఖన్నాలతో తొలి ప్రేమ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న ఈ డైరక్టర్ ప్రేమనగర్ నిర్మించిన మనవడి కోసం అద్భుతమైన లవ్ స్టోరీ ని సిద్ధం చేశారు. “వెంకీ అట్లూరి తో నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రకటించే ఈ ఆదివారం.. నాకు ఓ లవ్లీ సండే. ఈ చిత్రాన్ని బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మే నుంచి సెట్స్ మీదకు వెళుతుంది” అని అఖిల్ ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు సంబరపడ్డారు. ఈ ప్రకటనతో అఖిల్ మూడో సినిమా విషయంలో వస్తున్న రూమర్లన్నీ కొట్టుకుపోయాయి.