Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?
- June 14, 2025 / 08:31 AM ISTByPhani Kumar
రమ్యకృష్ణ (Ramya Krishnan) పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు తన అందంతో ఓ ఊపు ఊపేసింది. మొదట్లో ఈమెను ఐరన్ లెగ్ అని విమర్శించిన వారు ఉన్నారు. హీరోయిన్ గా పనికిరాదు అని అవమానించిన ఫిలిం మేకర్స్ కూడా ఉన్నారు. కానీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (Kovelamudi Raghavendra Rao) చేతిలో పడిన తర్వాత ఈమె దశ తిరిగింది. ‘అల్లుడుగారు’ (Alludugaru) అనే సినిమాతో ఈమెకి లైఫ్ ఇచ్చారు రాఘవేంద్రరావు.
Ramya Krishnan
ఆ తర్వాత ఈమె ఇంటి ముందు డేట్స్ కోసం నిర్మాతలు చెక్ బుక్..లతో ఎదురుచూశారు. అక్కడి నుండి ఆమె పద్దతిగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. గ్లామర్ విషయంలో రమ్యకృష్ణ (Ramya Krishnan) కి తిరుగులేదు. సౌత్ లోని అన్ని భాషల్లోనూ ఈమెకు అవకాశాలు రావడానికి ఇదే కారణం. 2000 సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాక.. పోటీగా కొంతమంది హీరోయిన్లు రావడంతో ఈమెకి అవకాశాలు తగ్గాయి.కానీ ‘బాహుబలి’ (Baahubali) వంటి సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. ఇప్పటికీ టాప్ ఆర్డర్ నటిగా రాణిస్తుంది.

రోజుకి ఈమెకు రూ.10 లక్షల పారితోషికం చెల్లిస్తున్నారు అంటే… ఆమె రేంజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. 10 రోజులు డేట్స్ ఇస్తే చాలు.. స్టార్ హీరోయిన్స్ మాదిరి కోటి పారితోషికం అందుకున్నట్టే అని చెప్పాలి.ఇదిలా ఉండగా.. రమ్యకృష్ణ (Ramya Krishnan) దాదాపు అన్ని రకాల పాత్రలు చేసింది. సౌత్ లో ఉన్న స్టార్స్ అందరి నటీనటులతో కలిసి నటించింది.కానీ రమ్యకృష్ణ (Ramya Krishnan) కి తండ్రిగా, భర్తగా, అన్నగా కనిపించిన నటుడు ఒకే ఒక్కరిని తెలుసా? అతను మరెవరో కాదు నాజర్ (Nassar).

‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi)సినిమా రీమేక్ అయిన ‘వంత రాజవతాన్ వరుమేను’ (Vantha Rajavathaan Varuven) సినిమాలో ఈమె నాజర్ ((Nassar) కి కూతురిగా కనిపించింది. అంటే తెలుగులో నదియా చేసిన పాత్రలో అనమాట. అలాగే ‘నరసింహ’ (Narasimha) సినిమాలో రమ్యకృష్ణకి (Ramya Krishnan) అన్నయ్య పాత్రలో కనిపించారు నాజర్ (Nassar). ఇక ‘బాహుబలి’ (Baahubali) సినిమాలో అయితే రమ్యకృష్ణకి భర్తగా కనిపించారు. ఇలా ఎలాంటి పాత్రైనా కూడా వీళ్ళు తమ బెస్ట్ ఇచ్చి ఆకట్టుకున్నారు అని చెప్పాలి.















