Nagarjuna: ఆ సినిమా తర్వాత ఆరు నెలలు సినిమాలకు బ్రేక్ ఇచ్చాను!

అక్కినేని నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన చివరిగా ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకోలేకపోయింది ఈ సినిమా తర్వాత నాగార్జున కొత్త సినిమాలను ప్రకటించలేదు. దీంతో అక్కినేని అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలోనే నాగార్జున కొత్త సినిమా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే ఈయన మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ద్వారా నాగార్జున ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున తన భార్య అమల గురించి అలాగే అఖిల్ గురించి పలు విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ అమల ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో తాను ఏకంగా సినిమాలకు ఆరు నెలల పాటు విరామం ప్రకటించానని తెలియజేశారు. అమల ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో తాను హలో బ్రదర్ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు.. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే 6 నెలలు సినిమాలకు బ్రేక్ ఇచ్చానని తెలిపారు.

ఈ ఆరు నెలలపాటు అమల పక్కనే ఉంటూ తనకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశానని అదేవిధంగా అమల డెలివరీ అయ్యే సమయంలో నా చేయి తన చేతిలోనే ఉందని నాగార్జున తెలిపారు. ఇలా ఒక మనిషి జన్మించడం నిజంగా ఓ అద్భుతం అని నాగార్జున తెలియజేశారు. ఇలా నా జీవితంలో ఆ ఆరు నెలల కాలం ఎంతో అద్భుతమైన క్షణాలుగా మిగిలిపోయాయి అంటూ ఈ సందర్భంగా అమల ప్రెగ్నెన్సీ సమయాన్ని నాగార్జున గుర్తు చేసుకుంటూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus