Mission Raniganj: ఆస్కార్‌ బరిలో… స్టార్‌ హీరో డిజాస్టర్‌ సినిమా! అవార్డు వస్తుందా?

  • October 16, 2023 / 12:24 PM IST

మన దేశానికి ఆస్కార్‌ అవార్డు తీసుకురావాలని చాలా ఏళ్ల నుండి సినిమా జనాలు ప్రయత్నాలు చేశారు. మన దేశం నుండి ఏటా అధికారిక ఎంట్రీగా ఎన్నో మంచి సినిమాలు ఆస్కార్‌ ఉత్తమ చిత్రం రేసులో నిలిచాయి కూడా. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురైంది. కానీ ఈ ఏడాది ‘ఆర్‌ఆర్ఆర్‌’ రూపంలో మనకు ఆస్కార్‌ వచ్చింది. అయితే ఆ సినిమా మన అధికారిక ఎంట్రీ కాదనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మరో సినిమా ఆస్కార్‌ బరిలో నిలవాలని అనుకుంటోంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన తాజా చిత్రం (Mission Raniganj) ‘మిషన్‌ రాణిగంజ్‌’. టిను సురేష్‌ దేశాయ్‌ తెరకెక్కించిన ఈ సినిమానే ఇప్పుడు ఆస్కార్‌ బరిలో నిలపాలని నిర్ణయించుకున్నారు. ఆస్కార్‌ రేసులో పోటీ పడేందుకు జనరల్‌ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా ‘మిషన్‌ రాణిగంజ్‌’ టీమ్‌ నామినేషన్ వేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా దారిలోనే వెళ్తున్న ‘మిషన్‌ రాణిగంజ్‌’ టీమ్‌ సోషల్ మీడియాలో అభినందనలు వస్తున్నాయి.

‘ఆస్కార్‌ 2024’ అధికారిక ఎంట్రీ కోసం మన దేశం నుండి చాలా భారతీయ చిత్రాలు పోటీ పడగా… మలయాళ ‘2018’ సినిమాను జ్యూరీ ఎంపిక చేసింది. ఇప్పుడు ఆ సినిమాతోపాటు ‘మిషన్‌ రాణిగంజ్‌’ కూడా ఉంటుంది అన్నమాట. రాణిగంజ్‌ కోల్‌ఫీల్డ్స్‌లో 65మంది మైనర్లను కాపాడిన జశ్వంత్‌ సింగ్‌ గిల్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అక్టోబర్‌ 6న విడులైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది.

కానీ ఇప్పుడు ఆస్కార్‌ కలలు కంటోంది టీమ్‌. అయితే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ రావడం వెనుక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ కృషి చాలా ఉంది. ఆస్కార్స్‌లో మన సినిమాను బరిలో నిలపడం అంటే యుద్ధంలో దిగడమే అంటుంటారు. ఇప్పడు ‘మిషన్‌ రాణిగంజ్‌’ టీమ్‌ కూడా ఇదే పని చేయాల్సి ఉంటుంది. మరి రాజమౌళి అండ్‌ కో చేసిన మేజిక్‌ను టిను సురేశ్‌ దేశయ్‌ చేస్తారేమో చూడాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus