‘ప్రేమలు’ తో (Premalu) తెలుగులో పాపులర్ అయ్యాడు మలయాళ హీరో నస్లేన్(Naslen). ఆ ఒక్క సినిమాతో ఇతను తెలుగు యువతకి బాగా చేరువయ్యాడు అనే చెప్పాలి. ఇప్పుడు ‘అలప్పుజ జింఖానా’ (Alappuzha Gymkhana) అనే మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మలయాళంలో ఏప్రిల్ 10న రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఏప్రిల్ 25 న రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి రిపోర్ట్స్ ను సొంతం చేసుకుంటుంది.
లేట్ గా రిలీజ్ అయినా ఇక్కడ కూడా మంచి రిపోర్ట్ రాబట్టుకుంది.లిమిటెడ్ రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.83 cr |
సీడెడ్ | 0.24 cr |
ఆంధ్ర | 0.52 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.59 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ (తెలుగు వెర్షన్) | 0.14 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.73 cr |
‘జింఖానా’ (Alappuzha Gymkhana) (తెలుగు వెర్షన్) బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.2.5 కోట్లు. 6 రోజుల్లో ఈ సినిమా రూ.1.73 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.12 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.77 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘హిట్ 3′(HIT 3) ‘రెట్రో’ (Retro) వంటి కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమాకి స్క్రీన్స్ తగ్గుతున్నాయి. అదొక డిజాడ్వెంటేజ్ అని చెప్పాలి.