తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ అలీ గురించి చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన కొన్ని వందల సినిమాలలో కమెడియన్ గా నటించడమే కాకుండా హీరోగా కూడా నటించారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలీ 2019 ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సిపీ పార్టీలో చేరిన విషయం మనకు తెలిసిందే.ఇలా పార్టీ కండువా కప్పుకున్న అలీ 2019 ఎన్నికలలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇలా వైఎస్ఆర్సిపీ పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా పాల్గొన్న ఈయనకు తప్పకుండా జగన్ ప్రభుత్వం ఏదో ఒక పదవిని కట్టబెడుతుందని అందరూ భావించారు.
ఇక తర్వాత ఎన్నికలు కూడా రాబోతున్నప్పటికీ ఏ విధమైనటువంటి పదవి ఇవ్వకపోవడంతో చాలామంది జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.ఇక రాజ్యసభ సభ్యుడిగా ఆలీ ఎంపిక అవుతారని వార్తలు వినిపించినప్పటికీ అది కూడా వీలుపడలేదు. మరో రెండు సంవత్సరాలలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలీకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా పదవిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఈ రెండు సంవత్సరాలపాటు అలీ ఈ పదవిలో కొనసాగుతారంటూ ఏపీ ప్రభుత్వం తెలియచేయడంతో అలీ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోని ఏపీ ప్రభుత్వం తనని ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా నియమించడంపై ఆలీ స్పందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో భాగంగా అలీ మాట్లాడుతూ… నేను వైసీపీ కండువా కప్పుకున్నప్పుడే నా ఉద్దేశం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను నేను ఎలాంటి పదవులు ఆశించే పార్టీలోకి రాలేదని ఆయనకు స్పష్టంగా వివరించాను.
అయితే నా గురించి జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందుకు నిదర్శనమే ఈ పదవి అంటూ ఈయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు నా కూతురు పెళ్లికి గిఫ్టుగా నాకు ఇచ్చారని భావిస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు ఇక ఆలీ భార్య జుబేదా సైతం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!