నటుడు అలీ రాజకీయాల్లోనే ఉన్నారు. అయితే అవి ప్రత్యక్ష రాజకీయాలు కాదు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రచారంలో పాల్గొనడం, పార్టీ గురించి మాట్లాడటం లాంటివే చేస్తుంటారు. 2019 ఎన్నికల సందర్భంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని కూడా చెప్పారు కానీ కుదర్లేదు. అయితే ఆయనను రాజ్యసభకు పంపిస్తారని, మండలికి పంపిస్తారని ఆమధ్య వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు అలాంటిదేం లేదు. దీని గురించి అలీని అడిగితే ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీతో సినిమా జనాలకు చిన్నపాటి పరిచయాలే ఉన్నాయి. అందులో అలీ ఒకరు. చాలా రోజులుగా వైఎస్ జగన్ అనుచరుడిగా ఉన్నారు. గతంలో రెండు కుటుంబాలకు మధ్య ఉన్న పరిచయం వల్లే జగన్‌కు దగ్గరగా ఉంటానని అలీ చాలా సందర్భాల్లో చెప్పారు. దీంతో నామినేట్ పదవో లేక మండలి సభ్యతవ్వమో ఇస్తారు అని చాలామంది అనుకున్నారు. ఇంకొందరు అయితే రాజ్యసభకు అలీని పంపిస్తారని అనుకున్నారు. ఆ మధ్య వైఎస్ జగన్‌ను అలీ కలవడంతో ఆ చర్చ ఎక్కువైంది.
వైఎస్ జగన్‌తో భేటీ తర్వాత… అలీ బయటికొచ్చి త్వరలో తీపి కబురు వింటారు అని కూడా చెప్పారు. కానీ మండలి ఖాళీలు పూరించేశారు. ఇప్పుడు రాజ్యసభ కూడా పూరించేశారు. నామినేటడ్ పదవులు కూడా పూరించేశారు. దీంతో అలీ మరికొన్నాళ్లు మొండిచెయ్యే అనుకున్నారు. తాజాగా అలీ దీనిపై మాట్లాడుతూ ‘‘నన్ను రాజకీయ నాయకుడిగా మార్చింది ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్. ఆయన నాకు ఎలాంటి హామీలివ్వలేదు. నా మీద నమ్మకం పెట్టుకోండి అన్నారంతే’’ అని చెప్పారు అలీ.
దాంతోపాటు ఏదో ఒక రోజు ఆయన నుండి ఫోన్ కాల్ వస్తే వెళ్లి కలుస్తా అని చెప్పారు అలీ. అయితే మరి ఇప్పుడు అలీకి ఇచ్చే పదవులు ఏమున్నాయి అనేది తెలియడం లేదు. త్వరలో ఏదైనా మండలి సభ్యుడు పదవీకాలం పూర్తయితే అందులోకి అలీని తీసుకోవాలి. లేదంటే ఏదైనా నామినేటడ్ పదవి ఖాళీ అయ్యేంతవరకు వేచి చూడాలి. తన వాళ్లు అనుకున్నవాళ్లకు ఎలా అయినా పదవిలో కూర్చోబెట్టడం వైఎస్ జగన్‌కు అలవాటు అంటుంటారు. చూడాలి మరి అలీకి ఏమిస్తారో?
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!