Alia, Ranbir: స్టార్ హీరోయిన్ ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అలియాభట్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది. కెరీర్ పరంగా అలియా చాలా బిజీగా ఉంది. అయినప్పటికీ.. తను చాలా కాలంగా ప్రేమిస్తున్న నటుడు రణబీర్ ను పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 14న అలియా, రణబీర్ ల వివాహం జరిగింది. అయితే పెళ్లైన రెండు నెలలకే ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అలియా గర్భవతి అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

హాస్పిటల్ లో స్కానింగ్ సమయంలో తీసిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘త్వరలోనే మా చిన్నారి రాబోతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలో అలియా పక్కనే రణబీర్ కూడా ఉన్నారు. స్కానింగ్ మెషిన్ వైపు చూస్తూ ఎంతో సంతోషంగా కనిపించింది అలియా. మొత్తానికి కపూర్ ఫ్యామిలీలోకి మరో మెంబర్ యాడ్ అవ్వబోతున్నారన్నమాట. మరోపక్క అలియా, రణబీర్ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో రణబీర్ జోరుగా పాల్గొంటున్నారు. ప్రెగ్నన్సీ కారణంగా అలియా ఈ సినిమా ప్రమోషన్స్ స్కిప్ చేసే ఛాన్స్ ఉంది. పెళ్లైన తరువాత వీరి నుంచి వస్తోన్న సినిమా కావడంతో బాలీవుడ్ లో బజ్ పెరిగింది. ఈ సినిమాను మూడు భాగాలుగా తీయాలనుకుంటున్నారు. మరి రెండు, మూడు భాగాల్లో అలియాను కంటిన్యూ చేసే అవకాశం ఉందో లేదో చూడాలి!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus