Alia Bhatt: హీరోయిన్ అలియా భట్ మళ్లీ తల్లి కాబోతున్నారా?

హిందీలో ఎక్కువ సినిమాలు చేసిన అలియా భట్ తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎన్టీఆర్30 సినిమాలో కూడా అలియా భట్ కు ఛాన్స్ వచ్చినా వ్యక్తిగత కారణాల వల్ల అలియా భట్ ఈ అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. తారక్ అలియా భట్ కాంబినేషన్ ను చూసే ఛాన్స్ మిస్ కావడం ఫ్యాన్స్ కూడా ఫీలయ్యారు. ఎన్టీఆర్30 సినిమాలో జాన్వీ కపూర్ ఎంపికయ్యారు.

అయితే ఇప్పటికే ఒక బిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్ మళ్లీ గర్భవతి అయ్యారని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. గతేడాది ఏప్రిల్ లో అలియా భట్ రణ్ బీర్ వివాహం జరిగింది. పెళ్లికి ముందే అలియా భట్ గర్భవతి అయిన సంగతి తెలిసిందే. నవంబర్ 6వ తేదీన అలియా భట్ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ బిడ్డకు రాహా కపూర్ అనే పేరు పెట్టారు.

అలియా మళ్లీ గర్భవతి అయ్యారని మరికొన్ని నెలల్లో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారని సమాచారం అందుతోంది. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి అలియా భట్ స్పందన రావాల్సి ఉంది. అలియా భట్ ఈ వార్తల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. అలియా భట్ ఈ మధ్య కాలంలో పలు యాడ్స్ లో కనిపించారు. అలియా భట్ ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.

అలియా భట్ ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. అలియా భట్ వరుస సినిమాలలో నటిస్తూ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. అలియా భట్ రాబోయే రోజుల్లో టాలీవుడ్ ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలియా భట్ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus