Alia Bhatt: ఆస్కార్ బరిలో గంగుబాయి కతియవాడి?

బాలీవుడ్ నటి అలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్న అలియా భట్ అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో సంజయ్ లీల బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన గంగుబాయి కతీయవాడి సినిమాలో నటించారు. ఈ సినిమాలో అలియా భట్ వేశ్య పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారని చెప్పాలి.

ఈ సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్న అలియా భట్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె నటించిన సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈమె పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఇకపోతే సమాచారం ప్రకారం అలియా భట్ నటించిన గంగుబాయి కతియవాడి సినిమా ఆస్కార్ రేసులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ లెవెల్ లో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా అత్యధిక వసూళ్లను కూడా రాబట్టింది.

ఈ క్రమంలోనే భారతీయ చలన చిత్రాల నుంచి ఆస్కార్ బరిలో ఉన్న సినిమాలలో గంగుబాయి కతియవాడి సినిమా కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.మరో రెండు నెలలలో ఆస్కార్ రేసులో ఉన్నటువంటి సినిమాల ప్రకటన వెలవడనుంది. ఈ క్రమంలోనే ఆస్కార్ రేసులో అలియా భట్ సినిమా కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కాకుండా ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR,

డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ఇది కాశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా ఆస్కార్ రేసులో ఉన్నాయి. ఇకపోతే తాజాగా అలియా భట్ గంగు బాయ్ కతియవాడి పేరు కూడా వినిపిస్తోంది. అయితే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ఆస్కార్ రేసులో ఉండడం ఇది మొదటిసారి కాదు ఇప్పటికే ఈయన దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలిచింది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus