రాజమౌళి డైరెక్షన్ లో నటించాలనే కోరికతో అలియా భట్ కొన్నేళ్ల క్రితం ఒక సందర్భంలో రాజమౌళిని కలిసి ఆయన సినిమాలో ఛాన్స్ కావాలని కోరింది. అలియా భట్ అలా అడిగిన కొన్నిరోజుల తర్వాత ఆమె ఆర్ఆర్ఆర్ సినిమాలోని సీత పాత్రకు ఎంపికైంది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో అలియా భట్ చాలా యాక్టివ్ గా పాల్గొనడంతో సినిమాలో ఆమెకు ఎక్కువ నిడివి ఉన్న పాత్ర లభించి ఉంటుందని అందరూ భావించారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన వాళ్లకు మాత్రం అలియా భట్ రోల్ గెస్ట్ రోల్ అని అనిపించింది.
అలియా భట్ అంత చిన్న పాత్రకు ఏ విధంగా ఓకే చెప్పింది అంటూ సినిమా రిలీజ్ తర్వాత చాలామంది సందేహం వ్యక్తం చేశారు. మరి కొందరు ఇంత చిన్న పాత్ర కోసం అలియా భట్ ను జక్కన్న సంప్రదించాల్సిన అవసరం ఏముందని కామెంట్లు చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత జక్కన్నపై అలియా భట్ కోపంగా ఉన్నారని ప్రచారం జరిగింది. తాజాగా అలియా భట్ సోషల్ మీడియాలో జక్కన్నను అన్ ఫాలో చేయడంతో పాటు ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన కొన్ని ఫోటోలను డిలీట్ చేశారని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత ప్రశంసలు దక్కుతాయని అలియా భట్ భావిస్తే అందుకు భిన్నంగా జరగడంతో అలియా భట్ తెగ ఫీలయ్యారని సమాచారం. రాజమౌళి భవిష్యత్తు సినిమాలలో ఛాన్స్ వచ్చినా అలియా భట్ నో చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఎడిటింగ్ లో అలియాకు సంబంధించిన సీన్లు కట్ అయ్యాయని అందుకే ఆమె ఫీలయ్యారని బోగట్టా.
అయితే అలియా భట్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. అలియా భట్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలో కూడా అలియా భట్ హీరోయిన్ గా ఎంపిక కావడం గమనార్హం.