Alia Bhatt: యానిమల్ సినిమా లిప్ లాక్స్ పై దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అలియా భట్..

Ad not loaded.

గతేడాది ఆలియా భట్‌తో పెళ్లయిన తర్వాత రణబీర్.. మొదటిసారి ఆన్‌ స్క్రీన్ వేరే హీరోయిన్‌కు లిప్ లాక్ ఇచ్చాడు. రణబీర్ చేసిన ఈ లిప్ లాక్‌కు ఆలియా రియాక్షన్ ఏంటి అని ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. దీనిపై ఆలియా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందనా జంటగా నటించిన సినిమా ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’లాంటి ‌బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు సందీప్.

ఇక తాజాగా ఈ మూవీ నుండి మొదటి పాట విడుదలయ్యింది. ఈ పాటలో రష్మిక, రణబీర్ మధ్య రొమాన్స్‌ను ‘అర్జున్ రెడ్డి’కి మ్యాచ్ అయ్యేలా ప్లాన్ చేశాడు సందీప్. ‘హువా మే’ అంటూ సాగే ఈ పాటలో రష్మిక, రణబీర్ పెయిర్ చాలా క్యూట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లిరికల్ వీడియో కాకుండా ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ప్రీతమ్ సంగీత దర్శకత్వంలో రాఘవ్ చైతన్య, ప్రీతమ్ ఈ పాటను పాడారు. హిందీలో ‘హువా మే’గా విడుదలయిన ఈ పాట.. తెలుగు ‘అమ్మాయి’గా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

అటు తెలుగులో, ఇటు హిందీలో రెండు భాషల్లోనూ పాటకు పాపులారిటీ లభిస్తోంది. ఇదే సమయంలో రణబీర్ భార్య ఆలియా భట్.. పాటపై రియాక్ట్ అయ్యింది. రణబీర్ కపూర్, ఆలియా భట్ గతేడాది పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా విడుదలయ్యింది. ఆ సినిమాలో భార్యభర్తలుగా ఆలియా, రణబీర్ లిప్ లాక్ ఇవ్వడంతో ప్రేక్షకులు దానిని పెద్దగా హైలెట్ చేయలేదు.

అయితే ఇప్పుడు రష్మికతో ‘యానిమల్’లో జరిగిన లిప్‌లాక్‌పై ఆలియా రియాక్షన్ ఎలా ఉంటుంది అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తుండగా.. ఈ పాట గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో తన స్టోరీలో షేర్ చేసింది ఆలియా. ‘లూప్‌లో ప్లే అవుతుంది’ అంటూ తనకు పాట చాలా నచ్చిన విషయాన్ని బయటపెట్టింది. దీంతో రణబీర్ లిప్ లాక్స్‌ను చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ఆలియా (Alia Bhatt) సినిమాల విషయానికొస్తే.. తను వసన్ బాలా దర్శకత్వంలో ‘జిగ్రా’ అనే చిత్రంలో నటిస్తోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus