Alia Bhatt: ఆ సీన్‌ చూసినప్పుడల్లా ఏదో ఆందోళన.. బ్లాక్‌బస్టర్‌పై ఆలియా కామెంట్స్‌ వైరల్‌.!

సగటు ప్రేక్షకులే కాదు సినిమా వాళ్లు కూడా సినిమాల్లో సీన్స్‌ చూసి నిజమే అనుకుంటూ ఆందోళన చెందుతుంటారు. ఈ మాటలో ఏమన్నా డౌట్‌ ఉందా? అయితే ప్రముఖ కథానాయిక ఆలియా భట్‌ రీసెంట్‌గా చెప్పిన మాటలు చదవండి మీకే తెలుస్తుంది. అవును బాలీవుడ్‌కే కాదు.. మొత్తంగా ఇండియన్‌ సినిమాకే బ్లాక్‌బస్టర్‌ అనిపించుకున్న ఓ సినిమా చూసేటప్పుడు, అందులో ప్రత్యేకంగా ఓ సన్నివేశంలో చూసేటప్పుడు చాలా ఆందోళనపడ్డా అని చెప్పింది. సగటు ప్రేక్షకులకేనా.. హీరోలకూ, హీరోయిన్లకూ కూడా అభిమాన నటులు ఉంటారు.

Alia Bhatt

అలా ఆలియా భట్‌కి (Alia Bhatt) కూడా ఉన్నారు. ఆలియా అభిమాన హీరో షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) అనే విషయం తెలిసిందే. ఆయన ఆయన నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాలోని ఓ సన్నివేశం గురించి ఆలియా భట్ కొన్ని ఆసక్తికర సంగతుల్ని షేర్‌ చేసుకుంది. షారుఖ్‌ – కాజోల్‌ (Kajol) నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలో ఓ ప్రేమ సన్నివేశం చూస్తే.. ఇప్పటికీ గూస్‌బంప్స్‌ వస్తుంటాయి అని చెప్పింది.

ఆ సినిమాలో ఓ సన్నివేశంలో కాజోల్‌ తనను ప్రేమిస్తే వెనక్కి తిరిగి చూస్తుందని షారుఖ్‌ ఖాన్‌ ఎదురుచూస్తుంటాడు. ఒక్కసారి కాజోల్‌ తిరిగి చూసినప్పుడు వచ్చే సంగీతం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది అని చెప్పింది ఆలియా. ఇప్పటికీ సినిమా చూసినప్పుడు చాలా ఆందోళన కలిగుతుంది అని ఆలియా చెప్పింది. ప్రతి అమ్మాయి తన జీవితంలో ఒక్కసారైనా ఆ సీన్‌ను రీక్రియేట్‌ చేయాలని కోరుకుంటుంది అని కూడా చెప్పింది.

అంతేకాదు.. అవకాశం వస్తే కచ్చితంగా అలాంటి సన్నివేశంలో నటిస్తా అని ఆలియా భట్‌ చెప్పింది. ఈ లెక్కన ఆమె కోసం అలాంటి సీన్‌ను రైటర్స్‌ సిద్ధం చేయాలి. చూద్దాం ఎవరు అ పని చేస్తారో? ఇక అలియా ప్రస్తుతం ‘జిగ్రా’, ‘ఆల్ఫా’ తదితర సినిమాలతో బిజీగా ఉంది. ‘జిగ్రా’ సినిమాను దసరా కానుకగా తీసుకొస్తున్నారు. ‘ఆల్ఫా’ యశ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా సిద్ధమవుతోంది.

పాపం ఎన్ని అందాలు ఆరబోసినా కనికరించని బాలీవుడ్ బాక్సాఫీస్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus