డిసెంబర్ లో పెళ్లి అని వస్తున్న రూమర్స్ పై ఆలియా స్పందన
- February 20, 2020 / 01:17 PM ISTByFilmy Focus
బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మాత్రమే కాదు పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ కూడా అయిన ఆలియా భట్ త్వరలోనే “ఆర్.ఆర్.ఆర్” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవ్వనున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు గతేడాది తాను రణబీర్ కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నానని ప్రకటించడం.. బాలీవుడ్ మొత్తం షాక్ అవ్వడం కూడా జరిగింది. అయితే.. ఈ ఏడాది ఆలియా-రణబీర్ పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలు మాత్రం ఆమె అభిమానులను కాస్త భయపెట్టాయి. మరీ ముఖ్యంగా ఈ సమ్మర్ లో వాళ్ళ పెళ్లి అని బాలీవుడ్ టాప్ మీడియా హౌజ్ లు కథనాలు వెల్లడించడం ఇందుకు ఆజ్యం పోసింది.

అయితే.. ఇదే విషయమై ఆలియాను అడగగా.. ఆమె చాలా సింపుల్ గా కొట్టిపడేయడంతోపాటు.. ఇలాంటి వార్తలు తాను కూడా చదువుతానని, చదివి నవ్వుకొంటానని ఆలియా చెప్పడం విశేషం. తనకు ఈమధ్యకాలంలో ఇలాంటి గాసిప్పులే ఎంటర్ టైన్మెంట్ అని కూడా ఆమె పేర్కొనడం గమనార్హం.
Most Recommended Video
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!












