అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్.. వీళ్లు ముగ్గురు బాలీవుడ్ యంగ్ సెలబ్రిటీస్ ‘టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటున్నారు. ఈ ముగ్గురూ హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ట్విట్టర్ లో ఈ ముగ్గురు పేర్లతో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.. 2012 అక్టోబర్ 19న ’స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
బాలీవుడ్ కింగ్ మేకర్, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్.. స్టార్ కిడ్స్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చెయ్యడంలో లక్కీ హ్యాండ్, గోల్డెన్ లెగ్ గా చెప్పుకునే కరణ్ జోహర్ ఈ ముగ్గురు యంగ్ స్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ధర్మ ప్రొడక్షన్స్ తో పాటు రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ మీద షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కూడా నిర్మాతగా వ్యవహరించారు. లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన కరణ్ ఈ మూవీతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు.
ఫస్ట్ సినిమా అయినా అలియా, వరుణ్, సిద్ధార్థ్ ముగ్గురికీ పర్ఫార్మెన్స్ పరంగా మంచి పేరు వచ్చింది.. వీళ్ల కెరీర్ కి పునాది వేసిందీ మూవీ.. తర్వాత ఎవరికి వారు డిఫరెంట్ ఫిలింస్ చేస్తూ ఆడియన్స్ ని అలరించడమే కాక ఓన్ ఐడెంటిటీతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నారు.. వరుణ్, సిద్ధార్థ్ కేవలం బాలీవుడ్ కే పరిమితమయ్యారు..కానీ అలియా భట్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది..
అచ్చ తెలుగుదనం ఉట్టిపడే పాత్రలో ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అలరించింది.. తనతో పాటు భర్త రణ్ బీర్ కపూర్ ని కూడా ‘బ్రహ్మాస్త్ర‘ తో (డబ్బింగ్) తెలుగు ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసింది.. ట్రిపులార్ తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అలాగు ‘గంగూభాయి కతియావాడి’ లో ఛాలెంజింగ్ రోల్ చేసి ఆశ్చర్యపరిచింది..
వరుణ్, సిద్ధార్థ్ కూడా డిఫరెంట్ మూవీస్ తో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సినీ ప్రముఖులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ ఈ ముగ్గురు యాక్టర్స్ కి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.. ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ సినిమాకుండే కిక్, ఆ మెమరీసే వేరు కదా..