అల్లు అర్జున్ బర్త్‌డేకి రీ రిలీజ్ అవబోతున్న సినిమా ఏదంటే..

  • March 14, 2023 / 09:24 PM IST

టాలీవుడ్ ‘స్టైలిష్ స్టార్’ తెలుగుతో పాటు మలయాళంలోనూ స్టార్ డమ్ సంపాదించుకుని అక్కడ ‘మల్లు’ అర్జున్‌గా అలరిస్తున్నాడు.. కట్ చేస్తే ‘పుష్ప : ది రైజ్’ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.. నార్త్‌లోనూ సాలిడ్ క్రేజ్ తెచ్చకున్నాడు. అక్కడ ‘పుష్ప’ రాజ్ గా సత్తా చాటి.. సీక్వెల్ ‘పుష్ప : ది రూల్’ కోసం ప్రేక్షకులంతా వెయిట్ చేసేలా చేశాడు.. ఇక ఇటీవల సందీప్ రెడ్డి వంగాతో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ సంస్థలో సినిమా అనౌన్స్ చేశారు..

బన్నీ ఈ మూవీకి రెమ్యునరేషన్‌గా ఏకంగా రూ. 125 కోట్లు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.. ఇదిలా ఉంటే ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్‌డే వస్తోంది.. ఈ సందర్భంగా తనతో మూవీస్ చేస్తున్న మేకర్స్.. ఫ్యాన్స్‌కి సాలిడ్ సర్‌ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నారు.. ‘పుష్ప : ది రూల్’ నుండి అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్ రానుందని సమాచారం.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్.. పార్ట్ 1కి మించి పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారని..

ఇప్పటికే రెండు, మూడు మేజర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయని.. త్వరలో అబ్రోడ్ షెడ్యూల్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రిలీజ్ అనుకుంటున్నారు.. ఒకవేళ కుదరకపోతే వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు..ఇక బన్నీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మరో శుభవార్త అందిందంటూ సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.. అల్లు అర్జున్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సాలిడ్ సూపర్ హిట్ ‘దేశముదురు’ రీ రిలీజ్ కానుంది..

4K, DTS వంటి లేటెస్ట్ టెక్నాలజీతో తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ స్క్రీన్లలో రీ రిలీజ్ చేయనున్నారట.. బన్నీ కమర్షియల్ హీరోగా నిలబడడంలో ‘దేశముదురు’ బాగా హెల్ప్ అయింది. బాల గోవింద్ క్యారెక్టర్‌లో బన్నీ మేనరిజమ్స్, డైలాగ్స్, సాంగ్స్, డ్యాన్స్ అన్నీ అదిరిపోతాయి.. అప్పుడు మిస్ అయిన వాళ్లు, ఆల్ రెడీ చూసిన వాళ్లు మళ్లీ ఓ షో వేసుకోవచ్చన్నమాట..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus