Badri: పవర్ స్టార్, డాషింగ్ డైరెక్టర్ పూరిల సెన్సేషనల్ ‘బద్రి’ లేటెస్ట్ వీడియో వైరల్..

టాలీవుడ్‌లో కొద్ది రోజుల నుండి స్టార్ హీరోల పుట్టినరోజులు, బెంచ్ మార్క్ ఇయర్స్‌కి సూపర్ హిట్ సినిమాల స్పెషల్ షోలు.. ఇంకో అడుగు ముందుకేసి ఫిలిం నుండి డిజిటల్‌లోకి కన్వర్షన్ చేయించి పాత చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేయడం అనే ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు మరో క్రేజీ ఫిలిం రీ రిలీజ్ కానుంది.. పవర్ స్టార్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన ఫస్ట్ పిక్చర్..

దర్శకుడిగా పూరి తొలి చిత్రం ‘బద్రి.. మిలీనియం ఇయర్ (2000) లో వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.. విజయలక్ష్మీ మూవీస్ బ్యానర్ మీద సీనియర్ ప్రొడ్యూసర్ టి. త్రివిక్రమ రావు నిర్మించగా.. అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా నటించారు. రాక్ స్టార్ రమణ గోగుల మ్యూజిక్ సెన్సేషన్ అయింది. 2002 ఏప్రిల్ 20న రిలీజ్ అయిన ‘బద్రి’ ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రేక్షకాభిమానుల కోరిక మేరకు రీ మాస్టర్డ్ వెర్షన్ రెడీ చేస్తున్నారు. 4 K, డీటీఎస్, క్యూబ్ లాంటి వాటితో సినిమాకు కొత్త హంగులు అద్దుతున్నారు. 22 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ మూవీని హాళ్లల్లో చూడడం ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌కి ఫుల్ థ్రిల్ ఇస్తుంది.. ‘బద్రి’ త్వరలో రీ రిలీజ్ కానుందని తెలియజేస్తూ షేర్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేయగా నెట్టింట బాగా వైరల్ అవుతోంది.. పీకే ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ ట్రెండ్ చేస్తున్నారు.

పవన్ కెరీర్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ.. రికార్డ్ రేంజ్ కలెక్షన్లు రాబట్టింది.. పవన్ మేనరిజమ్స్, డైలాగ్స్, సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్.. తన మ్యూజిక్ మ్యాజిక్‌తో యూత్‌ని మాయ చేశాడు రమణ గోగుల.. ‘తమ్ముడు’ తర్వాత ఆయన పవన్‌తో చేసిన సెకండ్ సినిమా ఇది..‘బద్రి’ పవన్, పూరిలకు వెరీ స్పెషల్ ఫిలిం.. ఈ సినిమా అప్పుడే పవర్ స్టార్ రేణు దేశాయ్‌ని ఇష్టపడ్డారు. పూరి, అమీషా పటేల్ ఇద్దరికీ ఫస్ట్ ఫిలిం.. బ్రహ్మానందం, మల్లిఖార్జున రావు, ఆలీ కామెడీ హైలెట్ అసలు.. త్వరలో ట్రైలర్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus