కీర్తి రెడ్డి… ‘తొలిప్రేమ’ సినిమా చూసిన వాళ్ళు ఈమెను అంత ఈజీగా మర్చిపోలేరు. ఈమె తెలుగమ్మాయే..! హైదరాబాద్లో జన్మించింది. కీర్తి రెడ్డి తల్లి ఓ డిజైనర్(డ్రెస్), తాత గడ్డం గంగారెడ్డి నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం మాజీ ఎంపీ.అయితే కీర్తి రెడ్డి విద్యాభ్యాసం బెంగళూరులో జరిగింది.! 8 సంవత్సరాల వయసులోనే భరత నాట్యంలో శిక్షణ పొందిన కీర్తి రెడ్డి ఉన్నత చదువుల కోసం విదేశాలకి వెళ్లడం జరిగింది. కరుణాకరణ్ దర్శకత్వంలో రూపొందిన తొలిప్రేమ సినిమా ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
కానీ ఈమె మొదటి సినిమా అలీతో చేసిన ‘గన్ షాట్’. అవును ఆ సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడు. ఇక ‘తొలిప్రేమ’ తర్వాత కీర్తి రెడ్డి కెరీర్ రాకెట్ లా దూసుకుపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. తర్వాత ఈమె నటించిన ‘ప్రేమించే మనసు’ ‘రావోయి చందమామ’ సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. కొంత గ్యాప్ తీసుకుని మహేష్ బాబు అర్జున్ సినిమాలో నటించినా లాభం లేకుండా పోయింది.
ఆ తర్వాత సుమంత్ ను పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈమె రెండో పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయినట్టు టాక్ నడిచింది. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం కీర్తి రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. అవును విషయం ఏంటంటే.. ఈమె (Keerthy Reddy) మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కొంతమంది డైరెక్టర్లు చెప్పిన కథలు వింటున్నట్టు తెలుస్తుంది