Kiara ,Sidharth: సిద్ధార్థ్ – కియారా ల పెళ్ళికి అంతా సిద్ధం..!

కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘యం.యస్.ధోని’ బయోపిక్ లో సాక్షిగా అందరికీ దగ్గరైంది. ఇక మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’.. మూవీతో ఈమె టాలీవుడ్లో అడుగుపెట్టింది. మొదటి చిత్రమే సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ వెంటనే ఈమెకు రాంచరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కూడా ఈమెకు అవకాశం లభించింది.

కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఆమె ఫుల్ ఫోకస్ బాలీవుడ్ పైనే పెట్టింది. అక్కడ ‘కభీర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి స్టార్ డంని.. సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..కొంతకాలంగా ఈమె స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తో డేటింగ్లో ఉన్నట్టు గట్టిగానే ప్రచారం జరిగింది.

చాలా ఈవెంట్లలో వీళ్ళు చేట్టపట్టాలేసుకుని తిరిగేవారు. ముందుగా ‘షీర్షా’ అనే మూవీలో నటించడం ద్వారా వీరి మధ్య ప్రేమ చిగురించింది అని కథనాలు మొదలయ్యాయి. తర్వాత ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేసరికి ఇది నిజమే అని అంతా ఫిక్స్ అయ్యారు. ఇక ఫిబ్రవరి 6న వీరి పెళ్లి రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఘనంగా జరగనుంది. అంటే మరో 4 రోజుల్లోనే అన్న మాట.

ఫిబ్రవరి 4 నుండి హల్దీ వేడుకలతో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుకానున్నాయి.ముంబై ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఔట్ ఫిట్స్ లో కియారా కనిపించబోతున్నట్టు వినికిడి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus