షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్ లాగా.. సందేశాన్ని వినోదంతో, మాస్ ఎలిమెంట్స్‌తో అందించే దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల జాబితా చూస్తే ఈ విషయం చక్కగా అర్థమైపోతుంది. తాజాగా అలాంటి కథ మరొకటి సిద్ధం చేశాట. ఈ సారి ఆయన చూపు రాజకీయాలవైపు పడింది. అంతేకాదు ఆ సినిమా పవన్ కల్యాణ్‌తో అని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇదేంటి… అంత ఈజీగాగా కుదిరిపోతుందా అనుకుంటున్నారా? అని అంటారా.
ఇక్కడ మనమో విషయం గుర్తుంచుకోవాలి. పవన్ ప్రజెంట్ ఉన్న సిట్యువేషన్‌లో ఇలాంటి సినిమా ఒకటి అవసరమని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. వరుస కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వెళ్తే పొలిటికల్ మైలేజ్ రాదని సన్నిహితులు చెబుతున్నారని వార్తలొస్తున్నాయి. ఫైనల్‌గా పవన్ ఓ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయాలని అనుకుంటున్నారట. అందుకే… కొరటాల కథకు ఓకే చెబుతారు అని అంటున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి కాన్సెప్ట్‌ను పవన్‌కు కొరటాల వినిపించారని అంటున్నారు.
పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుంటే ముందుకు వెళ్లొచ్చు అని పవన్ సూచించారని కూడా అంటున్నారు. అయితే కొరటాల ప్రస్తుతం తారక్ సినిమా పనులు మొదలుపెట్టాల్సి ఉంది. ‘ఆచార్య’ విడుదలయ్యాక ఆ పనిలో మునిగిపోతారు కొరటాల. ఆ తర్వాత పవన్ సినిమా సంగతికొస్తారని అంటున్నారు. ఈలోపు పవన్ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాల సంగతి చూస్తారట. ‘‘పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయాలనుంది. దానికోసం ఓ శక్తివతమైన కథ రాసుకున్నా. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ మంచి నాయకుడిగా కనిపిస్తారు.
కానీ రాజకీయంగా పవన్ బిజీ అయిపోవడంతో ప్రాజెక్ట్ కుదర్లేదు. ఇప్పుడు ఆయన సినిమాలు చేస్తున్నారు కదా చూడాలి’’ అని అన్నారట కొరటాల. పవన్ సినిమా మెటీరియలైజ్ అయ్యేలా ఉంది కాబట్టే… కొరటాల ఇలా మాట్లాడారు అని అంటున్నారు. అయితే దీనికి నిర్మాత ఎవరు అనేది చూడాలి. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సీజన్‌లో పవన్ ఆఖరి సినిమా ఇదే అవుతుంది అని చెప్పొచ్చు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ సినిమాల నుండి పొలిటికల్ పడవ ఎక్కుతాడు. ఈలోపు ఈ సినిమా చేయాలి మరి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!